Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

డైరక్టర్ కు హీరో టెస్ట్

డైరక్టర్ కు హీరో టెస్ట్

సరిగ్గా చదవకపోయినా రాయకపోయినా, లేదా సరిగ్గా రావడం లేదని అనుమానం వచ్చినా టీచర్ ఏం చేస్తారు..స్టూడెంట్ ను దగ్గర కూర్చోపెట్టుకుని పాఠాలు రాయిస్తారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే ఎదురైందట ఓ డైరక్టర్ కు. 

అక్కడి కథ..ఇక్కడ కథ తెచ్చి మిక్సీలో వేసి అల్లేసి కథలు అల్లేస్తాడు అని ఓ రచయిత కమ్ డైరక్టర్ మీద అపవాదులు వున్నాయి. ఏమైతేనేం మంచి కథకుడిగా పేరు పడిపోయాడు. డైరక్షన్ కూడా చేసేసాడు.

కానీ మళ్లీ సినిమా అంటే మాత్రం ఏళ్లు గడిచిపోతున్నాయి. ఆఖరికి ఓ హీరోతో సినిమా ఓకె అయింది. హీరో రెడీగా వున్నాడు. కానీ కథ కరెక్షన్లు పూర్తి కావడం లేదు. అప్పటికీ అద్దె టీములు పెట్టి కిందా మీదా పడ్డాడు. డబ్బులు ఖర్చయ్యాయి కానీ కొలిక్కి రాలేదు. పాత్ర కోసం హీరో గెడ్డం మాత్రం పెరుగుతోంది.

ఇలాంటి టైమ్ లో విసిగిపోయిన హీరో రంగంలోకి దిగిపోయాడట. అక్కడెక్కడో టీమ్ లతో కూర్చుని చర్చలు సాగించడం కాదు. తన ఆఫీసులోనే కూర్చుని స్క్రిప్ట్ మొత్తం తయారు చేయమని టాస్క్ ఇచ్చాడట. దాంతో ఇప్పుడు సదరు రైటర్ కమ్ డైరక్టర్ చేసేది లేక హీరో ఆఫీసులోనే కూర్చుని కథ కరెక్షన్లు పూర్తి చేసే పనిలో పడ్డాడట. 

హీరోలు అందరూ ఈ మధ్య కథల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా వుంటున్నారు. ప్రతి హీరో కూడా అంత సులువుగా డైరక్టర్ల బుట్టలో పడిపోవడం లేదు. మంచి పరిణామమే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?