రన్నింగ్‌లో ఉన్న సినిమా మధ్యలో ఆపేసి, దర్శకుడిని మార్చడం.. మన టాలీవుడ్‌లో లేదు. నచ్చినా, నచ్చకపోయినా సదరు దర్శకుడిని భరించాల్సిందే. అయితే ఈమధ్య దర్శకులకు డిమోషప్ ఇచ్చిన వార్తలు ఎక్కువగానే వస్తున్నాయి. రభస దర్శకుడు సంతోష్ శ్రీన్‌వాస్‌తో ఇది మొదలైంది. ఆయనకు ఒంట్లో బాగాలేదని, అందులో ఈ సినిమాని మరో దర్శకుడితో లాగించేస్తున్నారనే వార్తలొచ్చాయి. అయితే ఆ తరవాత ఈ విషయాన్ని చిత్రబృందం ఖండించిందనుకోండి. అది వేరే విషయం. ఇప్పుడు ఇద్దరు దర్శకులు కూడా ఇంచుమించు ఇలాంటి పరిస్థితినే ఎంచుకొంటున్నారు. అన్నట్టు ఇద్దరి పేర్లూ శ్రీనివాసరెడ్డినే కావడం విశేషం.
వివరాల్లోకి వెళ్తే… నాగచైతన్య – శ్రీనివాసరెడ్డి కలయికలో దుర్గ తెరకెక్కతోంది. ఈ సినిమా నుంచి శ్రీనివాసరెడ్డి బయటకు వచ్చేశారనేది లేటెస్ట్ టాక్. మరోవైపు నితిన్ – శ్రీనివాసరెడ్డి కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందుతోంది. సురేందర్‌రెడ్డి శిష్యుడు.. ఈ శ్రీనివాసరెడ్డి. తాజా సమాచారం మేరకు ఈ ప్రాజెక్టు నుంచి శ్రీనివాసరెడ్డిని తప్పించారని సమాచారమ్. అయితే.. అధికారికంగా ఈ విషయాల్ని ఆయా చిత్రబృందాలు దృవీకరించడం లేదు.