వస్తా నీ వెనుక సినిమాలో రెండో కథానాయికగా నటించడానికి ఒప్పుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది అమలాపాల్. కథ నచ్చి, పాత్ర నచ్చి ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకొన్నా… అని అమలాపాల్ చెప్తోంది గానీ.. భారీ పారితోషికానికి పడిపోయిందని, అందుకే ఈ ఆఫర్ అందుకొందని టాలీవుడ్ సమాచారమ్. ఇప్పటి వరకూ అమలాపాల్ పారితోషికం పాతిక లక్షలకు అటూ ఇటూ మాత్రమే.
ఈ సినిమా కోసం మాత్రం అందుకు నాలుగింతలు అందుకొందట. అంటే… కోటి రూపాయలు. అందుకే మరో మాట అడక్కుండా.. ఈ సినిమాపై సంతకం చేసిందని టాక్. అయితే ఈ విషయాన్ని అమలాపాల్ ఒప్పుకోవడం లేదు. ''నాకు ఎంత ఇవ్వాలో నా దర్శక నిర్మాతలకు తెలుసు. ఏ క్లాస్, బీ క్లాస్, సీ క్లాస్ అంటూ కథానాయికల్ని విడగొడతారు. పారితోషికం ప్రాతిపదికన గ్రేడ్‌లు ఇస్తారు. ఈ పద్ధతేం నాకు అర్థం కావడం లేదు..'' అని వాపోతోంది.
అన్నట్టు అమలాపాల్ చిత్ర నిర్మాణ రంగంలోనూ కాలుమోపాలని చూస్తోందట. ఈ యేడాది ఆఖర్లో ఓ చిన్న సినిమాకి నిర్మాతగా వ్యవహరించాలని ఆలోచిస్తోంది. బోటిక్, రెస్టారెంట్ స్థాపించాలన్న ఐడియాలూ ఉన్నాయట.