‘డర్టీ పాలిటిక్స్’ సినిమాలో నటించిన మల్లికా షెరావత్, రియల్ లైఫ్‌లో రాజకీయాల పట్ల తనకు చాలానే ఆసక్తి వుందని చెబుతోంది. ‘మంచి ప్లాట్ ఫామ్’.. అనగా ఓ మంచి రాజకీయ పార్టీ దొరికితే, రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమేనని ప్రకటించిందీ బాలీవుడ్ సెక్సీ బాంబ్.
‘మర్డర్’ సినిమాతో మల్లికా షెరావత్ బాలీవుడ్‌లో ‘హాట్ ప్రాపర్టీ’ అయిన విషయం విదితమే. అప్పటినుంచీ అడల్ట్ రేటెడ్ సినిమాలంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది మల్లికా షెరావత్ పేరే. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. సన్నీలియోన్ లాంటి అడల్ట్ స్టార్ వచ్చేశాక, మల్లికా షెరావత్‌ని ఎవరు పట్టించుకుంటారు.?
‘హిస్’ సినిమాతో మల్లికా షెరావత్‌ని బాలీవుడ్ దాదాపుగా పక్కన పెట్టేసింది. ప్రస్తుతం ‘డర్టీ పాలిటిక్స్’ అనే సినిమాలో నటించిన మల్లికా షెరావత్, ఆ సినిమా రిలీజ్ కోసం చాలా టెన్షన్‌తో ఎదురుచూస్తోంది. ఈ సినిమా పోస్టర్ వివాదాస్పదంగా రూపొందడం, సినిమా యూనిట్‌కి వ్యతిరేకంగా కొందరు పోలీసులను ఆశ్రయించడం తెల్సిన విషయాలే.
సినిమా టైటిలేమో డర్టీ పాలిటిక్స్.. హీరోయిన్ చెబుతున్న మాటేమో.. రాజకీయాల్లోకి రావడం ఇష్టమేనని. సినిమా వేరు, రాజకీయం వేరు. అన్నట్టు, రాజకీయాల్లోకొస్తే మహిళా సాధికారతపై పోరాడతానని చెబుతోంది మల్లికా షెరావత్. తెరపై కుర్రాళ్ళను వేడెక్కించే పాత్రల్లో కన్పించినా, అమ్మడికి చాలా ఉన్నత భావాలున్నాయన్నమాట.