అలీ… తెరపైనా, బయటా నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు. ఎదుటివాడు ఎవ్వరైనా, ఎలాంటివాళ్లైనా వదలడు.. ఏదో ఒకటి అనాల్సిందే. అయితే అప్పుడప్పుడూ ఈ కామెడీ కాస్త శృతిమించిపోతూ ఉంటుంది. కానీ… అలీ గురించి తెలిసినవాళ్లెవ్వరూ దీన్నంత సీరియస్ గా తీసుకోరు.
తాజాగా అలీ ఓ కథానాయికని టార్గెట్ చేస్తూ సెటైర్లు ఏశాడు. ఆమె ఎవరో కాదు… గౌరీ ముంజల్. బన్నీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిందీ భామ. ఆ తరవాత బాగా ఒళ్లు చేయడం వల్ల సైడ్ అయిపోవాల్సివచ్చింది. ఈమధ్య దుబాయ్‌లో జరిగిన గామా అవార్డుల కార్యక్రమంలో గౌరీ ముంజల్ డాన్సులు చేసి అదరగొట్టింది.
వేదికపై ఉన్న అలీ.. గౌరీతో పరాచకాలు ఆడాడు. ''బన్నీ సినిమాలో లేత తాటిముంజెలా ఉండేది. ఇప్పుడు తాటికాయలా తయారైంది..'' అని సెటైరేశాడు. ముంజెల్ కి అలీ తెలుగు అర్థమైందో లేదో గానీ, ఆమె కూడా నవ్వేసింది.