కిత‌కిత‌లు సినిమానే కాపీ కొట్టారా?

బ‌క్క మొగుడు – బండ పెళ్లాం ఈ కాన్సెప్టుతో వ‌చ్చిన ఈవీవీ సినిమా కిత‌కిత‌లు ఎంత పెద్ద హిట్టయ్యిందో అంద‌రికీ తెలుసు. టీవీలో ఈసినిమా వ‌స్తోందంటే ఇప్పటికీ ప‌డీ ప‌డీ చూస్తుంటారు. ఇప్పుడు ఇదే…

బ‌క్క మొగుడు – బండ పెళ్లాం ఈ కాన్సెప్టుతో వ‌చ్చిన ఈవీవీ సినిమా కిత‌కిత‌లు ఎంత పెద్ద హిట్టయ్యిందో అంద‌రికీ తెలుసు. టీవీలో ఈసినిమా వ‌స్తోందంటే ఇప్పటికీ ప‌డీ ప‌డీ చూస్తుంటారు. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్‌ని బాలీవుడ్ ఎత్తేసింది. 

జీరో సైజు హీరో, ఫ్యామిలీ ప్యాక్ అమ్మాయి క‌థ‌తో అక్కడ ఓ సినిమా తెరకెక్కింది. అదే.. ద‌మ్ ల‌గాకే హైస్సా. ఆయుష్మాన్ ఖురానా,  భూమి పెడ్నేకర్ జంటగా న‌టించారు. య‌ష్ రాజ్ ఫిల్స్మ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. 

ఈ సినిమా ట్రైలర్ ఈమ‌ధ్యే విడుద‌ల చేశారు. చూస్తే.. అంద‌రికీ కిత‌కిత‌లు సినిమా గుర్తుకు రావ‌డం ఖాయం. బాలీవుడ్ సినిమాలోని పాయింట్లను తెలివిగా ఎత్తేసి, ఇక్కడ ఫ్రీమేక్ చేసుకొంటుంటే, ఇప్పుడు ఇక్కడి క‌థ‌లు అటు వెళ్తున్నాయ‌న్నమాట‌. మ‌రి బాలీవుడ్‌లో ఈ సినిమా ఎన్ని కిత‌కిత‌లు పెడుతుందో చూడాలి.