సునీల్ కాస్త నలుపు కావచ్చు…కానీ అతను పండించే నవ్వులు..తెల్లటి పువ్వులే. అందుకే కావచ్చు..సునీల్ తాజా సినిమాకు మల్లెపువ్వు అని పేరు పెట్టారు. దిల్ రాజు నిర్మాతగా వాసువర్మ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమాకు మలుపు అని పేరు పెట్టారని వార్తలు వినవచ్చాయి.
కానీ మలుపు అంటే అదేదో సామాజిక చిత్రం అన్న ఫీల్ వస్తుందని, పేరు మార్చాలని డిసైడ్ అయ్యారు. అందుకే ఇప్పుడు మల్లెపువ్వు అని మార్చుకున్నరట. శోభన్-లక్ష్మి జంటగా మల్లెపువ్వు సూపర్ హిట్. కానీ భూమిక హీరోయిన్ గా మరో మల్లెపువ్వు వచ్చి వాడిపోయింది. ఇది ముచ్చటగా మూడోది.
జోష్ ఫెయిల్యూర్ తో కసిగా వున్న వాసు వర్మ, ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా దీన్ని తీర్చి దిద్దుతున్నట్లు తెలుస్తోంది. సునీల్ మార్కు కామెడీ, డ్యాన్స్ లు రెండూ కలిసి ఈ మల్లెపువ్వును జనాలకు నచ్చేలా చేస్తాయనే అనుకోవాలి.