టెంపర్ సెట్లో ఎన్టీఆర్ – మధురిమ గొడవ పడ్డారా??? మధురిమ నటన ఎన్టీఆర్‌కి నచ్చలేదా..??? పూరి కూడా మధురిమ పనితీరుపై అసంతృప్తి వెళ్లగక్కడా..?? ఈ విషయంపై ఫిల్మ్‌నగర్ ఆసక్తిగా చర్చించుకొంటోంది.
ఎన్టీఆర్ – మధురిమ లమధ్య విపరీతమైన గ్యాప్ వచ్చిందని, సెట్లో అనారోగ్యకరమైన వాతావరణం చోటు చేసుకొందని చెప్పుకొంటున్నారు. ఈ విషయమై పూరి స్వయంగా స్పందించాల్సివచ్చింది. టెంపర్ పై ఎన్నో రూమర్లు వస్తున్నాయి. అవన్నీ ఎవరూ పట్టించుకోవద్దని ఆయన అభిమానుల్ని కోరుతున్నారు.
ఎన్టీఆర్ – మధురిమ గొడవ కూడా ఉత్తిదే అంటున్నారు. మధురిమ చక్కగా నటించిందని, ఆమె కెరీర్‌కి ఈ సినిమా బాగా హెల్ప్ అవుతుందని పూరి చెబుతున్నాడు. డబ్బుల కోసం ఎన్టీఆర్ డబ్బింగ్ ఆపేశాడన్న విషయంలోనూ నిజం లేదట. ఇవన్నీ ఎలా పుట్టుకొచ్చాయో తమకు తెలీదని, తన దృష్టంతా ఈనెల 13పైనే ఉందని చెప్పాడు పూరి.