చ‌ర‌ణ్‌పై స‌మంత గుస్సా

రామ్‌చ‌ర‌ణ్‌పై స‌మంత కారాలు, మిరియాలూ నూరుతోంద‌ట‌. శ్రీ‌నువైట్ల సినిమాలో త‌న‌కు ఛాన్స్ రాక‌పోవ‌డానికి కార‌ణం రామ్‌చ‌ర‌ణే అని స‌న్నిహితుల‌కు చెప్పి బోరు మంటోంద‌ట‌. రామ్‌చ‌ర‌ణ్ – శ్రీ‌నువైట్ల సినిమా నుంచి త‌ప్పుకొంది.. స‌మంత‌. ఆ…

రామ్‌చ‌ర‌ణ్‌పై స‌మంత కారాలు, మిరియాలూ నూరుతోంద‌ట‌. శ్రీ‌నువైట్ల సినిమాలో త‌న‌కు ఛాన్స్ రాక‌పోవ‌డానికి కార‌ణం రామ్‌చ‌ర‌ణే అని స‌న్నిహితుల‌కు చెప్పి బోరు మంటోంద‌ట‌. రామ్‌చ‌ర‌ణ్ – శ్రీ‌నువైట్ల సినిమా నుంచి త‌ప్పుకొంది.. స‌మంత‌. ఆ స్థానంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ వ‌చ్చి చేరింది. ఈ మార్పున‌కు కార‌ణం రామ్‌చ‌ర‌ణే అని తెలిసింది. 

స‌మంత స్థానంలో ర‌కుల్‌ని తీసుకొంటే బాగుంటుంద‌ని శ్రీ‌నువైట్లకు సూచించింది చ‌ర‌ణే అట‌. స‌మంత‌కి ఈమ‌ధ్య తెలుగులో స‌రైన విజ‌యాల్లేవు. ఆమె క్రేజ్ కొంచెం కొంచెం త‌గ్గుతోంది. ర‌కుల్ అయితే.. యువ‌త‌రం హృద‌యాల్లో ఇప్పుడిప్పుడే స్థానం సంపాదించుకొంటోంది. 

ఆమె అయితే సినిమాకి అన్నివిధాలా ప్లస్ అవుతుంద‌ని చ‌ర‌ణ్ భావించాడ‌ట‌. హీరో చెబితే తిరుగేముంది… శ్రీ‌నువైట్ల సై అన్నాడు. అలా.. చ‌ర‌ణ్ వ‌ల్ల స‌మంత ఓ సినిమా నుంచి త‌ప్పుకొంది. మ‌రి చ‌ర‌ణ్ త‌న‌పై పెట్టుకొన్న న‌మ్మకం ర‌కుల్ ఎంత‌లా నిల‌బెట్టుకొంటుందో చూడాలి.