డిజె పై బజ్ ఎలా వుంది?

డిజె సినిమా పై మొదట్నించీ ఓ లెవెల్ లో అంచనాలు పెరుగుతూవచ్చాయి. ఎంతో వర్క్ చేస్తే తప్ప అరవింద్ దగ్గర గ్రీన్ సిగ్నల్ రాదు. పైగా దిల్ రాజు అంటే నిర్మాత అంటే కథపై…

డిజె సినిమా పై మొదట్నించీ ఓ లెవెల్ లో అంచనాలు పెరుగుతూవచ్చాయి. ఎంతో వర్క్ చేస్తే తప్ప అరవింద్ దగ్గర గ్రీన్ సిగ్నల్ రాదు. పైగా దిల్ రాజు అంటే నిర్మాత అంటే కథపై కాస్త గట్టి కసరత్తే చేస్తారు.ఏవరేజ్ సినిమాను కూడా బన్నీ ఓ లెవెల్ కు తీసుకెళ్లగలడు.

ఇవన్నీ కలిసి డిజె సినిమాకు బజ్ ను పెంచుకుంటూ పోయాయి. కానీ ఇటీవల ఇండస్ట్రీ సర్కిళ్లలో సినిమాపై టాక్ ఒకటి మెల్లగా స్ప్రెడ్ అవుతోంది. ఇది ఏమంత పాజిటివ్ గా లేదు. పైగా ట్రయిలర్ పై రెస్సాన్స్ కూడా యూ ట్యూబ్ లో ఒకె కానీ, కంటెంట్ విషయంలో అంత శాటిస్ ఫాక్షన్ గా కనిపించడం, వినిపించడం లేదు.

పైగా దిల్ రాజు కూడా సినిమా జస్ట్ కమర్షియల్ ఫార్మాట్ తప్ప వేరు కాదని, అయితే కమర్షియల్ హిట్ పక్కా అని అంటున్నట్లు గ్యాసిప్ లు వినిపించడం ప్రారంభమైంది. అయితే బన్నీ, అరవింద్ లు ఏ సినిమాను అంత తేలిగ్గా తీసుకోరని, సాన పెట్టి పెట్టి కానీ వదలరని, అందువల్ల డిజె విషయంలో ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్ ఎలావున్నా, సమస్య ఏమీ వుండదని, సినిమా పాస్ అయిపోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.