Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై అయోమయం..?

లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై అయోమయం..?

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈనెల 22న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా థియేటర్లలోకి రావాల్సి ఉంది. చంద్రబాబుకి వ్యతిరేకంగా ఈ సినిమా ఉండబోతుందనేది అందరికీ తెలిసిన విషయమే. మామ ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన విలన్ గా ఆయన పాత్రని ఈ సినిమాలో చూపించబోతున్నారని టీజర్లు క్లియర్ గా చెబుతున్నాయి.

సో.. సహజంగానే టీడీపీ ఈ సినిమా విడుదలను అడ్డుకుంటుందనే అనుమానాలున్నాయి. సెన్సార్ కత్తెరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ ని బలిచేస్తారని అనుకున్నారు, కానీ అంతకంటే ముందే ఎన్నికల కోడ్ కత్తెరకు రామ్ గోపాల్ వర్మ సినిమా బలవబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల ఆపేయాలని, ఈ సినిమా ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉందని టీడీపీ కార్యకర్త ఒకరు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 11 వరకూ సినిమా విడుదల వాయిదా వేయాలని కోరారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఈ ఫిర్యాదుని సీఈసీ పంపించింది. దీంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై అనుమానాలు ఎక్కువయ్యాయి.

వాస్తవంగా చూస్తే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఏ ఒక్క పార్టీకి అనుకూలంగా లేదు, ఎవరికీ ప్రచారం చేయడం లేదు. అంటే ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించేలా సినిమా కంటెంట్ లేదనే విషయం అర్థమవుతోంది. అయితే కావాలనే దీన్ని టీడీపీ రాజకీయం చేస్తోంది, చేయిస్తోంది. సినిమా విడుదలైతే చంద్రబాబు పరువు, ప్రతిష్ట పూర్తిగా దెబ్బతింటాయనే ఉద్దేశంతోనే బాబు టీమ్ ఈ సినిమా విడుదలకు అడ్డుపడుతోంది.

అందులోనూ బాలకృష్ణ చేసిన ఎన్టీఆర్ బయోపిక్ రెండుభాగాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇలాంటి టైమ్ లో వర్మ సినిమా సూపర్ హిట్ అవుతుందని ఆ జనాలు భయపడుతున్నారు. అందుకే ఎన్టీఆర్ సినిమాకి అడుగడుగున అడ్డుపడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. అందులో భాగమే తాజా కంప్లయింట్.

అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం దేనికీ భయపడటంలేదు. తేడాకొడితే సినిమా మొత్తం యూట్యూబ్ లో వదిలేస్తానంటూ హెచ్చరిస్తున్నాడు. కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీసిన నిర్మాత ఈ యూట్యూబ్ రిలీజ్ కి అంగీకరించకపోవచ్చు కానీ, ఆర్జీవీ మాత్రం వెనక్కి తగ్గబోనని కరాఖండిగా చెప్పేస్తున్నాడు.

ఎన్నికల సంఘం నిర్ణయంపైనే లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల ఆధారపడి ఉంది. సో.. అందరికంటే ఈ సినిమాను ఎన్నికల సంఘం చూడబోతోందన్నమాట.

ఓట్లను కొనడంకాదు, మాయమే చేస్తున్నారు!

నన్ను ఏమైనా చేసినా డైరెక్ట్ సినిమా అందులోనే.. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?