అవును.. మహేష్ సినిమా ఆఫర్ వచ్చింది

మహేష్ బాబు, అనీల్ రావిపూడి కాంబినేషన్ లో రావాల్సిన సినిమాపై రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది. మొన్నటికిమొన్న ఈ సినిమాలో ఈ కీలకపాత్ర కోసం విజయశాంతిని సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. అందులో కొంత…

మహేష్ బాబు, అనీల్ రావిపూడి కాంబినేషన్ లో రావాల్సిన సినిమాపై రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది. మొన్నటికిమొన్న ఈ సినిమాలో ఈ కీలకపాత్ర కోసం విజయశాంతిని సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. అందులో కొంత వాస్తవం కూడా ఉంది. ఇప్పుడీ ప్రాజెక్టుకు సంబంధించి మరో సీనియర్ నటుడి పేరు తెరపైకి వచ్చింది. అతడి పేరు ఉపేంద్ర.

అవును.. కన్నడ నటుడు ఉపేంద్రను మహేష్ సినిమా కోసం సంప్రదించారట. ఈ విషయాన్ని ఉపేంద్ర స్వయంగా ప్రకటించాడు. ఐ లవ్ యు సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన ఉపేంద్ర, మహేష్ సినిమా కోసం అనీల్ రావిపూడి తనను కలిసిన మాట వాస్తవం అన్నాడు.

నన్ను కలిశారు. కానీ నాకు చాలా కమిట్ మెంట్స్ ఉన్నాయి కుదరదని చెప్పాను. కానీ అతడు వినలేదు. ముందు స్టోరీ వినమన్నాడు. ఓకే అన్నాను. కానీ ఇంకా స్టోరీ వినలేదు. సబ్జెక్ట్ విన్న తర్వాత చూద్దాం. మహేష్ సినిమాకు సంబంధించి త్వరలోనే స్టోరీ వింటానని క్లారిటీ ఇచ్చాడు ఉపేంద్ర.

కాకపోతే అందులో నటించాలా వద్దా అనే నిర్ణయం మాత్రం ఇంకా తీసుకోలేదు. ఎందుకంటే కర్నాటక ఎన్నికల బరిలో దిగాలనుకుంటున్నాడు ఈ హీరో. ఇలాంటి టైమ్ లో మహేష్ బాబు సినిమాకు ఓకే చెబితే కాల్షీట్లు కేటాయించడం కష్టమౌతుందని ఫీలవుతున్నాడు.

రాజకీయాలతో పాటు తన సొంత డైరక్షన్ లో కూడా ఓ సినిమాను ఎనౌన్స్ చేశాడు ఉపేంద్ర. కాబట్టి తెలుగులో ఇప్పట్లో నటించలేనని చెప్పేశాడు. కాకపోతే దర్శకుడి కోరిక మేరకు ఓసారి స్టోరీ మాత్రం వింటానని మాటిచ్చాడట. బహుశా, అనీల్ రావిపూడి చెప్పిన స్టోరీ లైన్ విన్న తర్వాత ఉపేంద్ర తన మనసు మార్చుకుంటాడేమో.

ఓట్లను కొనడంకాదు, మాయమే చేస్తున్నారు!

నన్ను ఏమైనా చేసినా డైరెక్ట్ సినిమా అందులోనే..