అన్ని అర్హతలూ వుండి హీరోగా వచ్చిన వ్యక్తి అరవింద్ కృష్ణ. ఈయన ప్రస్తుతం నటిస్తున్న ‘యవ్వనం ఒక ఫాంటసీ’ సినిమా రిలీజ్‌కి రెడీగా వుందట. ఈ సినిమాతో తాను హీరోగా వుండాలా? లేదా? అనే నిర్ణయం జరిగిపోతుందంటున్నాడు. మధుర శ్రీధర్ నిర్మించిన ‘ఇట్స్ మై లవ్ స్టోరీ’తో పరిచయమై, ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ నిర్మించిన ‘రుషి’ చిత్రంలో అందరి దృష్టిలో పడ్డాడు.
సినిమాలున్నా ఇంతవరకూ హీరోగా సరైన బ్రేక్ దొరకలేదతనికి. ఇప్పుడు దర్శకుడు వీర వరప్రసాద్ నీలం నిర్మిస్తున్న ‘యవ్వనం ఒక ఫాంటసీ’ సినిమా కథ తననెంతో ఆకట్టుకుందని, ఖచ్చితంగా హీరోగా నిలదొక్కుకునే అంశాలన్నీ ఈ సినిమాలో వున్నాయని అరవింద్ కృష్ణ నమ్ముతున్నాడట.
ఎంతో సీనియారిటీ వున్న వరప్రసాద్ నీలం కథను తెరకెక్కించిన విధానం ఖచ్చితంగా కె.బాలచందర్ లాంటి గొప్ప దర్శకుడిని మళ్ళీ గుర్తుచేస్తుందనీ యవ్వనంలో ప్రతి యువతీయువకులూ పడే అగచాట్లూ, తప్పులు, ఒప్పులూ ఈ సినిమాలో కనిపిస్తాయనీ, ఇలాంటి యూత్ ఫిలింని తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారనీ, యవ్వనం ఒక ఫాంటసీతో తన కెరీర్ అటో ఇటో తేలిపోతుందంటున్నాడు యంగ్ హీరో అరవింద్ కృష్ణ.