ప్రపంచ తెలుగు సంఘాలలో అతి పెద్దదైన ఉత్తరమెరికా తెలుగు సంఘం (తానా) లో నూతన కార్య వర్గ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. భక్త బల్ల మరియు చంద్ర గుంటుపల్లి ఆధ్వర్యం లో మార్చి 13 శనివారం సాయంత్రం 7 గంటలకు బేఏరియా మిల్పిటాస్ పీకాక్ హాల్ లో తానా ఎన్నికల ప్రచార కార్య క్రమాన్ని నిర్వ హించారు.
ఈ కార్య క్రమాని కి దాదాపు 300 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తానా చరిత్రలోనే మొదటి సారి రెండు వర్గాలుగా విడిపోయి పోటి జరుగుతుందన్నారు. దీనిలో ఒక వర్గం నుంచి ప్రెసిడెంట్ గా రామ్ యలమంచిలి, సెక్రటరీ గా భక్త బల్ల, సురేన్ పాతూరి కోశాదిరికారి గాను, బుల్లయ చౌదరి జాయింట్ సెక్రటరీ గాను, కాలిఫోర్నియా రీజినల్ కోఆర్డినేటర్ గా చంద్ర గుంటుపల్లి పోటి చేస్తున్నారు.
వీరికి ఇప్పటికే అమెరిక మొత్తంలో మంచి స్పందన లభించిందని, తమ వర్గమే అన్ని పదవులను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేసారు. తమని గెలిపిస్తే తానా సేవలు మరింత విస్తరిస్తూ అమెరిక లో ఉన్న ప్రతివారందరికి అందుబాటులో ఉంటామని, యువతను ప్రోత్స్తాహిస్తామని, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తామన్నారు.
Photos: https://flic.kr/s/aHsk8HqBPC