ఈ డైలాగు గోపాలుడిదా..గబ్బర్ సింగ్ దా?

‘కొన్ని సార్లు రావడం లేటు కావచ్చేమో కానీ, రావడం మాత్రం పక్కా’ ఇదీ గోపాల గోపాల టీజర్ లో ఫైనల్ పంచ్ డైలాగ్. ఆ డైలాగు పేల్చింది పవన్ కళ్యాణ్. ఇంతకూ గోపాల గోపాల…

‘కొన్ని సార్లు రావడం లేటు కావచ్చేమో కానీ, రావడం మాత్రం పక్కా’ ఇదీ గోపాల గోపాల టీజర్ లో ఫైనల్ పంచ్ డైలాగ్. ఆ డైలాగు పేల్చింది పవన్ కళ్యాణ్. ఇంతకూ గోపాల గోపాల సినిమాకు ఈ డైలాగ్ కు సంబంధం ఏమిటో సినిమా చూస్తే కానీ తెలియదుకానీ,ఈలోగా ఈ డైలాగు గబ్బర్ సింగ్ 2 కి కూడా అన్వయిస్తుందని మాటలు వినిపిస్తున్నాయి. 

రెండేళ్లకు పైగా గబ్బర్ సింగ్ 2 సినిమా ఊరిస్తోంది. కానీ ఇంతవరకు సెట్ పైకి వెళ్లలేదు. బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ డైలాగ్ జోడించారా? లేక గోపాల గోపాల కూడా కాస్త లేటయింది కాబట్టి, ఈ డైలాగు వదిలినట్లా? ఎందుకంటే ఇంత అడియో ఫంక్షన్ చేసినా గోపాల గోపాల విడుదల తేదీ ఇంకా ఖరారుగా చెప్పలేదు. గతంలో చెప్పిన 14 వ తేదీ మాత్రమే ఇప్పటికి లేటెస్ట్ అప్ డేట్.