Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఈ లీకులు మంచివే 'గీతా'

ఈ లీకులు మంచివే 'గీతా'

గీత గోవిందం సినిమా రా ఫుటేజ్ లీక్ అయింది. ఆ మాటకు వస్తే మరికొన్ని సినిమాల ఫుటేజ్ లు కూడా లీక్ అయ్యాయన్నది వాస్తవం. ఏ సినిమాకైనా లీక్ అన్నది సమస్యే. అందులో సందేహంలేదు. కానీ గీత గోవిందం లీకులు కొన్ని వాట్సప్ లో చలామణీ అవుతున్నాయి. ఇవన్నీ పక్కా రా ఫుటేజ్ లు. అంతంతమాత్రం క్లారిటీతో డైలాగ్ మిక్సింగ్ లేకుండా వున్నాయి. 

అయితే మూడు ఫుటేజ్ లు పరిశీలిస్తే, సినిమాకు భలే ప్లస్ అయ్యేలాగే వున్నాయి. ముఖ్యంగా ఈ సీన్లన్నీ యూత్ ఫుల్ గా, పక్కా విజయ్ దేవరకొండ ఇమేజ్ కు మ్యాచ్ అయ్యేలా వుండడం విశేషం. అందువల్ల ఈ ఫుటేజ్ లు చూసిన కుర్రకారు ఎవరైనా కచ్చితంగా సినిమాకు వెళ్లేలా ప్రేరేపించేలాగే వున్నాయి. అందువల్ల గీతాసంస్థకు గీత గోవిందం విషయంలో టెన్షన్ లేనట్లే అనుకోవాలి. 

నిజానికి ఈరోజు గీతగోవిందం ట్రయిలర్ వదలాలి. రెడీ చేసారు. డీటీఎస్ మిక్సింగ్ చేయించే టైమ్ లో ఈ లీకుల గోల మొదలయింది. దాంతో ట్రయిలర్ ఆలోచనను పక్కన పెట్టేసారు. నిజానికి ట్రయిలర్ బాగా కట్ చేసారని, చూసిన యూనిట్ జనాల మాట. కానీ నిర్మాత-హీరో అందరూ కూర్చుని లీకుల గోల నేఫథ్యంలో ఇక ట్రయిలర్ వద్దని ఆపేసారు.

మొత్తంమీద చూసుకుంటే లాస్ట్ మినిట్ టెన్షన్ ఇబ్బంది పెట్టినా, ఈ లీకులు బాగానే స్ఫ్రెడ్ అయి, సినిమాకు గట్టి ఓపెనింగ్స్ తెచ్చేలాగే వుంది వ్యవహారం చూస్తుంటే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?