పెళ్లిచూపులు తరువాత సరైన సినిమా కోసం దర్శకుడు తరుణ్ భాస్కర్ కిందామీదా అయ్యాడు. హీరో నిఖిల్ తో సినిమా చేయాలని అనుకున్నాడు. ఇద్దరి మధ్య డిస్కషన్లు కూడా నడిచాయి. కానీ సరైన కథ చెప్పలేకపోయాడో, లేక చెప్పిన కథ నిఖిల్ కు నచ్చలేదో? సమ్ థింగ్ ఏదో జరిగింది. ప్రాజెక్టు సెట్ కాలేదు. అయితే ‘ఈ నగరానికి ఏమయింది’ సినిమా విడుదలకు ముందు మళ్లీ మరోసారి ఈ కాంబినేషన్ ఆలోచనల్లోకి వచ్చింది.
ఏస్ డిస్ట్రిబ్యూటర్ సునీల్ కూడా ప్రొడక్షన్ లోకి వస్తున్నారు. ఆయన తొలిసినిమా హీరో నిఖిల్ నే. ఆయనకు నిర్మాత సురేష్ బాబుకు మాంచి సంబంధాలు వున్నాయి. అందువల్ల ఆ ప్రాజెక్టుకు తరుణ్ భాస్కర్ ను డైరక్టర్ ను చేద్దామని అనుకున్నారు. దానికి నిఖిల్ కూడా ఆల్ మోస్ట్ ఓకె అన్నాడు. ఈ నగరానికి ఏమయింది రిజల్ట్ చూసి ముందుకు వెళ్లాలని నిఖిల్ అనుకున్నట్లు బోగట్టా.
మరి ఈ నగరానికి ఏమయింది రిజల్ట్ అంత ఆశాజనకంగా లేదు. సినిమా హిట్ నా కాదా అన్నది పక్కన పెడితే, సినిమాలో విషయంలేదు, టేకింగ్ తప్ప అని టాక్ వచ్చింది. విషయంలేదు అన్న క్రిటిక్స్ ను ‘అన్ క్వాలిఫైడ్ ఫెలోస్’ అనే టైపులో విమర్శలు చేసి, మీడియాకు టార్గెట్ అయ్యాడు తరుణ్ భాస్కర్. సరైన కథ వుంటే తప్ప నిఖిల్ ఒప్పుకోడు. దానికితోడు ఇలాంటి యాంటీ మీడియా పేరు. మరి నిఖిల్ చాన్స్ ఇస్తాడా? చూడాలి ఏం చేస్తాడో?