ఈ తమిళుడిని టాలీవుడ్ పూర్తిగా మరిచిపోయినట్టే!

ఒకదశలో అతడు తమిళుడు అంటే నమ్మడం కూడా కష్టమైంది.. టాలీవుడ్ అంతగా ఆదరించింది.. స్టార్‌గా చేసుకుంది. తెలుగు జనాలు ఆదరించారు, నిర్మాతలు, దర్శకులు కూడా అతడిని అదే స్థాయిలో చూసుకున్నారు. అయితే.. కొన్ని ప్లాఫులు…

ఒకదశలో అతడు తమిళుడు అంటే నమ్మడం కూడా కష్టమైంది.. టాలీవుడ్ అంతగా ఆదరించింది.. స్టార్‌గా చేసుకుంది. తెలుగు జనాలు ఆదరించారు, నిర్మాతలు, దర్శకులు కూడా అతడిని అదే స్థాయిలో చూసుకున్నారు. అయితే.. కొన్ని ప్లాఫులు సిద్ధూని కిందకు దించాయి. అదే సమయంలో అతడు తెలుగులో ప్రయత్నాలు చేయక పక్క భాషలవైపు పరుగులెత్తాడు.. దీంతో ఇప్పుడు సిద్దూను పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు తెలుగు గడ్డ మీద. ఈ హీరో తమిళంలో హిట్లను కొడుతున్నా మనోళ్లు ఏ మాత్రం పట్టించుకోకపోవడం విశేషం.

ఈ మధ్యనే కళావతి పేరుతో వచ్చిన ఒక సినిమాలో సిద్దూ ఉన్నాడన్న విషయం కూడా చాలా మందికి తెలియకుండా పోయింది. అది హన్సిక, త్రిషల సినిమా అన్నారు కానీ, సిద్ధార్థ్ నటించిన విషయాన్ని ప్రమోషన్‌లో కూడా పెద్దగా ప్రచారం చేయలేదు! మరి ఆ సినిమా అలా వెళ్లిపోయాకా తమిళంలో సిద్దూ ఒక సూపర్ హిట్‌నే నమోదు చేశాడు.

జిల్ జంగ్ జుక్ పేరుతో రూపొందిన సినిమా వైవిధ్యభరితమైనదిగా, ఎంటర్ టైనర్‌గా రివ్యూలు పొందింది. ఈ సినిమా కమర్షియల్‌గా కూడా తమిళంలో వర్కవుట్ అవుతోంది. మామూలుగా తమిళంలో ఏదైనా సినిమా పాజిటివ్ టాక్‌ను పొందితే మనోళ్లు వెయింటింగే లేకుండా దాన్ని డబ్ చేసేస్తూ ఉంటారు. కానీ సిద్ధు సినిమాను మాత్రం పట్టించుకోవడం లేదు ఎవరూ ఇప్పుడు!
 
ఏదో తన డబ్బింగ్ సినిమా తెలుగులో సరిగా ఆడకపోయే సరికి తెలుగు వాళ్లకు టేస్ట్ లేదని తేల్చేయడం దగ్గర నుంచినే సిద్దూకి తెలుగుతో బంధం తెగిపోయినట్టుంది!