మెగా క్యాంప్ నుంచి మరో హీరో?

మెగాస్టార్ అనే మహా వృక్షం మొలకెత్తడంతో దాని కొమ్మలు బోలెడు పుట్టుకు వచ్చాయి..అందంగా వున్నా, లేకున్నా, హీరో లక్షణాలు వున్నా లేకున్నా, అరడజను మందికి పైగా హీరోలుగా ట్రయ్ చేసారు. అదృష్టం బాగున్నవారు, బ్యాకింగ్…

మెగాస్టార్ అనే మహా వృక్షం మొలకెత్తడంతో దాని కొమ్మలు బోలెడు పుట్టుకు వచ్చాయి..అందంగా వున్నా, లేకున్నా, హీరో లక్షణాలు వున్నా లేకున్నా, అరడజను మందికి పైగా హీరోలుగా ట్రయ్ చేసారు. అదృష్టం బాగున్నవారు, బ్యాకింగ్ బలంగా వున్న వారు నిలదొక్కుకున్నారు. మిగిలిన వారు కిందా మీదా అవుతున్నారు. 

ఇప్పుడు మరో హీరో కూడా మెగా క్యాంప్ నుంచి వస్తాడని జనానికి అనుమానం కలుగుతోంది. అది ఎవరో కాదు..త్వరలో చిరంజీవి ఫ్యామిలీలో అల్లుడిగా అడుగుపెట్టబోతున్న కనుగంటి కళ్యాణ్. కుర్రాడు చూడ్డానికి బాగానే వున్నాడు. అంటే బాగుండదేమో కానీ, మెగా హీరోల్లో చాలా మంది కన్నా బాగానే వున్నాడు. 

అందువల్ల మామగారి అండతో హీరోగా ట్రయ్ చేస్తే తప్పేలేదు.. చేయడనీ లేదు. ఎందుకంటే కుర్రాడి తీరు చూస్తుంటే, లుక్స్ మీద కాస్త ఇంట్రెస్ట్ వున్నట్లే కనిపిస్తోంది. ఆ మాత్రం ఇంట్రెస్ట్ వుంటే చాలు సినిమాల్లోకి వచ్చేయచ్చు,.