రకుల్ వెంట రానా?

రానా… హీరోగా కన్నా గ్యాసిప్ ల్లో మరీ ఎక్కువ పాపులర్ అయిన నటుడు.  మీడియాకు రానా అలా కనిపిస్తాడో మరి రానాకు ఆ తరహా పాపులారిటీ ఇష్టమో, మొత్తానికి రానా మీద వచ్చినన్ని గ్యాసిప్…

రానా… హీరోగా కన్నా గ్యాసిప్ ల్లో మరీ ఎక్కువ పాపులర్ అయిన నటుడు.  మీడియాకు రానా అలా కనిపిస్తాడో మరి రానాకు ఆ తరహా పాపులారిటీ ఇష్టమో, మొత్తానికి రానా మీద వచ్చినన్ని గ్యాసిప్ లు, లింక్ లు ఇంకెవరిపైనా రావు..బాలీవుడ్ తారలు, తమిళ హీరోయిన్లు ఇలా చాలా మంది పేర్లే వినిపించాయి రానా పక్కన. అంతే కాదు..త్రిష తో అయితే రానాకు పెళ్లి చేసినంత పని చేసారు. 

ఇప్పుడు లెటెస్ట్ గ్యాసిప్ ఏమిటంటే, టాలీవుడ్ టాప్ సీడ్..రకుల్ ప్రీత్ సింగ్ తో రానా చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నాడని. ఈ గుసగుస ఎంతవరకు నిజమో తెలియదు..వాళ్ల చక్కర్లు ఏమో కానీ ఈ వార్త మాత్రం చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు టాలీవుడ్ లో వున్నహీరోయిన్లలో మాంచి ఫిజిక్..ఫిగర్ ఎవరిది అంటే రకుల్ దే. 

దాదాపు అందరు హీరోయిన్లను ఓ రౌండ్ వేసేసిన రకుల్ ఇఫ్పుడు సెకెండ్ రవుండ్ కు సిద్దం అవుతోంది. రానాకు హీరో రామ్ చరణ్ మంచి నేస్తం అని తెలిసిందే. రానా రికమెండేషన్ తోనే రకుల్ ఇప్పుడు రామ్ చరణ్ పక్కన రెండోసారి అది కూడా వరుసగా నటించే అవకాశం సంపాదించేసిందని టాక్ వినిపిస్తోంది మరి.