విక్టరీ వెంకటేష్ గురు సినిమాతో ఇటీవలే ప్రేక్షకులను పలకరించాడు. సినిమా సక్సెస్ అయింది కూడా. కానీ ఆ వెంటనే మరో సినిమా టేకాఫ్ మాత్రం కాలేదు. చాలా కాలంగా, చాలా మంది డైరక్టర్లు వెంకీని ఇంప్రెస్ చేసే కథ చెప్పడానికి విఫలయత్నాలు చేస్తున్నారు. కిషోర్ తిరుమల, పూరిజగన్నాధ్, క్రిష్ ఓ ముంబాయి కొత్త డైరక్టర్, ఇలా చాలా మంది ప్రయత్నించారు. కానీ సెట్ కాలేదు.
అయితే ఈ విషయంలో వెంకీ కూడా సీరియస్ గా వున్నట్లు లేదు. సినిమాల సంగతి పక్కన పెట్టి, టోటల్ దగ్గుబాటి ఫ్యామిలీ (రానా మినహా) అందరూ కలిసి యూరప్ సమ్మర్ క్యాంప్ కు వెళ్లిపోయారు. అట్నుంచి వచ్చాక, కొత్తగా కథలు వినడం ప్రారంభించాలి. ఇటీవల బాలీవుడ్ మూవీ జాలీ ఎల్ఎల్బీ సినిమాను హారిక హాసిని వాళ్లు కొన్నారు కానీ, వాళ్లింకా వెంకీని సంప్రదించలేదు. వెంకీ యూరప్ నుంచి వచ్చిన తరువాతనే ఏదయినా. పైగా ఇప్పుడు డైరక్టర్లు కూడా ఎవరూ ఖాళీ లేరు.
మొత్తం మీద జూన్ తరువాత డిసైడ్ కావాలి వెంకీ ఏ సినిమా చేస్తారన్నది. అంటే అప్పటికి ఇక మిగిలేది ఆరునెలల సమయం. మరి ఈలెక్కన మళ్లీ సంక్రాంతికే వెంకీ సినిమా వుండే అవకాశం వుంది.