పూనమ్ కౌర్. ఎప్పడో మాయాజాలం సినిమాలో వేసిన హీరోయిన్. ఆ తరువాత సరైన సినిమానే లేదు. కానీ ఇప్పటికీ తెలుగునాట వార్తల్లో వ్యక్తిగా వుండనే వస్తోంది. ముఖ్యంగా జనసేన అధిపతి సిఫార్స్ తో ఆంధ్ర చేనేత రాయబారిగా పదవి వచ్చిందని వార్తలు వినిపించినప్పటి నుంచి. అయితే ఆ తరువాత ఆమెకు, పవన్ కళ్యాణ్ కు వున్న వ్యవహారాల గురించి కత్తి మహేష్ లాంటి సోషల్ మీడియా సావియర్ లు పలు పాయింట్లు లేవనెత్తడం, పూనమ్ కౌర్ కూడా వివాదాస్పద పోస్టింగ్ లు ఫేస్ బుక్ లో చేసి, మళ్లీ తీసేయడం ఇలా చాలా జరిగాయి.
ఇప్పుడు మళ్లీ పూనమ్ కౌర్ పేరు వినిపిస్తోంది. అది కూడా ఓ మాంచి ప్రాజెక్టుకు ఆమెను ఎంపిక చేసారన్న వార్త. అది కూడా తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితుడు అయిన దర్శకుడు కే రాఘవేంద్రరావు ఫ్యామిలీకి చెందిన ఆర్కా మీడియా సంస్థ (బాహుబలి నిర్మాతలు) అదే తెలుగుదేశం పార్టీకి అత్యంత బలమైన అండగా వుండే ఈనాడు గ్రూప్ కలిసి నిర్మించే ఓ జానపద సీరియల్ స్వర్ణఖడ్గంలో కీలక పాత్రకు పూనమ్ కౌర్ ను తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఎప్పుడు సినిమా జనం సినిమాల కోసం తీసుకోవడం మరిచిపోయి, కేవలం రాజకీయ పరమైన గుసగుసల్లోనే వినిపించే పూనమ్ కౌర్ ను తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితులు అయిన వారు ఒక మూడేళ్ల పాటు ఉపాథి కలిగే అవకాశం ఇవ్వడం అన్నది కొత్త ఆలోచనలకు, గుసగుసలకు దారితీస్తోంది.
ఆ మధ్య పూనమ్ కౌర్ గురించి కొన్ని గుసగుసలు వినిపించాయి. ఆమె దగ్గర కొన్ని వీడియోలు వున్నాయని, వాటిని ఎలాగైనా సంపాదించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అందుకోసం ఎంతయినా ఇచ్చేందుకు ముందుకు వెళ్లారని వార్తలు వినవచ్చాయి. అలా ట్రయ్ చేసిన వారిలో ఎంపీ కావాలనుకునే ఓ బడా బిజినెస్ మన్, సంచలనాలు ప్రసారం చేసే ఓ చానెల్ వుందని గుసగుసలు వినిపించాయి.
అయితే ఆ తరువాత ఆ గుసగుసలు సద్దుమణిగాయి. ఇప్పుడు వున్నట్లుండి రామోజీ గ్రూప్-రాఘవేంద్రరావు ఫ్యామిలీ సంస్థ కంబైన్డ్ ప్రాజెక్టులోకి పూనమ్ కౌర్ రావడం కొత్త ఆలోచనలకు, గుసగుసలకు తావిస్తోంది.