ఇప్పటికే నా పేరు సూర్య సినిమాతో పెద్ద రిస్క్ చేస్తున్నాడు బన్నీ. ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువ, సందేశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి హీరో ఇప్పుడు మరో రిస్క్ కు సిద్ధమౌతున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. త్వరలోనే క్రిష్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్నాడనేది ఆ ప్రచారం.
బన్నీ సినిమాలు పక్కా కమర్షియల్ సినిమాలు. బాక్స్ బద్దలైపోద్ది లాంటి మాస్ సాంగ్స్, కొడితే కోమాలోకి వెళ్లిపోయే ఫైట్లు ఉండాల్సిందే. తన సినిమాలతో ఆడియన్స్ ను అలా ట్యూన్ చేశాడు బన్నీ. ఇక క్రిష్ విషయానికొద్దాం. ఇతడి సినిమాల్లో హీరోయిజం కంటే కథ ఫస్ట్ ప్లేస్ తీసుకుంటుంది. దాని తర్వాత 'సందేశం' సెకెండ్ ప్లేస్ తీసుకుంటుంది. ఈ రెండింటి మధ్యలో హీరోయిజం దోబూచులాడుతుంది.
గతంలో క్రిష్ దర్శకత్వంలో సినిమా చేసిన అనుభవం బన్నీకి ఉంది. కానీ అప్పుడు బన్నీ పొజిషన్ వేరు. ఇప్పుడు ఈ హీరో మార్కెట్ వేరు. ఇలాంటి టైమ్ లో క్రిష్ కు అవకాశం ఇస్తే మార్కెట్ తగ్గించుకున్నట్టే. సేమ్ టైం, కాస్త కొత్తగా కనిపించాలి, చరణ్ లా కొత్త కథలు ప్రయత్నించాలి అనుకుంటే మాత్రం క్రిష్ కు ఓకే చెప్పాల్సిందే.
అహం బ్రహ్మష్మి అనే టైటిల్ రిజిస్టర్ చేయించాడు క్రిష్. కథ కూడా రెడీ అయిపోయింది. మణికర్నిక షూటింగ్ కంప్లీట్ చేసిన ఈ దర్శకుడు, ప్రస్తుతం హీరో వేటలో ఉన్నాడు. అటు బన్నీ కూడా ఇప్పటివరకు మరో సినిమా ప్రకటించలేదు. సో.. వీళ్లిద్దరూ కలిసే అవకాశాలైతే ఉన్నాయి. అదే కనుక జరిగితే తన మార్కెట్ కు దూరంగా బన్నీ మరో ప్రయోగం చేస్తున్నట్టే.