'మా' సంఘం తమ స్వంత అని భావించవచ్చు. దాని సభ్యత్వం ఇవ్వము అని చెప్పుకోవచ్చు. తప్పులేదు. కానీ టాలీవుడ్ తమ స్వంతం అన్నట్లు, శ్రీరెడ్డితో నటిస్తే వెలివేస్తాం అనే ఫత్వాను జారీ చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
మహిళా సంఘాల జనాలు ఈ విషయంలో 'మా' వైఖరిని సూటిగా తప్పుపడుతున్నారు. అపూర్వ లాంటి చిన్న నటి, 'మా' మెంబర్ కూడా ఈ విషయంలో 'మా'ను తప్పు పట్టారు. ఎవరిని అడిగి అలాంటి డెసిషన్ తీసుకున్నారని ప్రశ్నించారు.
ఇండస్ట్రీలో వందలాది మంది చిన్న చిన్న అమ్మాయిలను టాలీవుడ్ లో కో డైరక్టర్లు, మేనేజర్లు ఇష్టం వచ్చినట్లు వాడేస్తున్నారని అపూర్వ వెల్లడించారు. కావాలంటే తాను వందమంది అలాంటి అమ్మాయిలను తీసుకువచ్చి సాక్ష్యం చెప్పిస్తా అని ఓ చానెల్ డిస్కషన్ లో పేర్కోన్నారు. మరి ఇప్పుడు 'మా' పెద్దలు ఏమంటారో?
శ్రీరెడ్డికి బోలెడు డబ్బుంది
అదే డిస్కషన్ లో పాల్గోన్న కరాటే కళ్యాణి మాట్లాడుతూ, శ్రీరెడ్డి 144ఎకరాల రియల్ ఎస్టేట్ వెంచర్ చేస్తోందని, ఆడి, వెర్నా కారులు వున్నాయని, కోటిన్నర ఖరీదైన అపార్ట్ మెంట్ వుందని ఆరోపించడం విశేషం. వీటన్నింటికి సాక్ష్యాలు సేకరిస్తున్నామన ఆమె అనడం చూస్తుంటే, శ్రీరెడ్డికి వ్యతిరేకంగా వున్న సినిమా జనాలు, ఆమెను కార్నర్ చేసే ప్రయత్నం ప్రారంభించినట్లు కనిపిస్తోంది.