హీరో నాని ప్లానింగ్ నే సూపర్ అనుకుంటే, నిర్మాత దిల్ రాజు అంతకన్నానూ. ఈ హీరో ఈ ఏడాదిలో ముచ్చటగా మూడో సినిమాకు రెడీ అయిపోతున్నారు. ఆ నిర్మాత ఏమో తన నిర్మాణంలో ఒకే ఏడాదిలో ఆరో సినిమాకు రెడీ అయిపోతున్నారు.
అలా ఇద్దరు కలిసిన సినిమా ఎంసిఎ. మిడిల్ క్లాస్ అబ్బాయి అన్నది ట్యాగ్ లైన్. ఈ ట్యాగ్ లైన్ కు, ఆ టైటిల్ కు తగ్గట్టే సూపర్ ఫస్ట్ లుక్ వదిలారు ఆ మధ్య. సగటు పక్కింటి కుర్రాడిలా, లుంగీ కట్టి, చేతిలో పాల ప్యాకెట్లతో ఫ్యాన్స్ ను అలరించాడు నాని.
ఫస్ట్ లుక్ ఇచ్చిన ఉత్సాహంతో టీజర్ విడుదలకు రెడీ అయిపోతున్నారు. 10వ తేదీన టీజర్ వదల్తున్నట్లు ప్రకటించేసారు. సినిమాను డిసెంబర్ లో విడుదల చేయాలన్నది దిల్ రాజు సంకల్పం. అలా చేస్తే ఇదే ఏడాది ఒకే బ్యానర్ లో ఒకే హీరో రెండు సినిమాలు ఇచ్చినట్ల అవుతుంది. అందుకే ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా, ఫస్ట్ లుక్ నుంచి టీజర్ వరకు చకచకా వచ్చేసారు నాని అండ్ దిల్ రాజు.