లెజెండ్‌తో జగపతిబాబు లెక్క మారిందన్నది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. ఆ సినిమా తరవాత ఆయన లైఫే మారిపోయింది. విలన్ ఆఫర్లు వరుస కడుతున్నాయి. క్రేజీ సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. అయితే.. ఇప్పుడు ఈ బాబుకి పబ్లిసిటీ పిచ్చ కూడా పట్టేసింది. దానికి తోడు ఆయన పీఆర్వోలు కూడా `మా బాబు బంగారం..` అంటూ బిల్డప్పులిస్తున్నారు.
పరిశ్రమ అంతా బాబు విలన్ కావడం వల్ల పిచ్చ హ్యాపీగా ఉందని, త్వరలోనే తెలుగు సినిమా విలనిజంలో కొత్త మార్పు రాబోతోందని… వాళ్లే బిల్డప్పులిస్తున్నారు. అంతే కాదు. కొన్ని సంస్థలు `మాకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండండి.. మాకు ఉండండి.` అంటూ బాబు వెంట పడుతున్నార్ట. కానీ బాబు మాత్రం `నో` చెప్పేస్తున్నాడట. అలాకాదని కొంతమంది బాబు అనుమతి లేకుండానే.. ప్రకటనల్లో బాబు పేరు వాడేసుకొంటున్నార్ట. దీనిపై త్వరలోనే చట్టపరమైన చర్యలు తీసుకొంటామని బాబు బృందం హెచ్చరిస్తోంది.
చేతిలో సినిమాల్లేని రోజుల్లో – శ్రీమేథ విద్యాసంస్థలకు ప్రచారం చేసి పెట్టాడు జగపతి. అప్పుడు లేని అభ్యంతరం బాబుకి ఇప్పుడెందుకు వచ్చిందో…? జగపతి బాబు అప్పుడూ, ఇప్పుడూ మనీ మైండెడే. ఈ విషయాన్ని బాబు సైతం ఒప్పుకొంటాడు. డబ్బులిస్తాం – యాడ్లు చేసిపెట్టండంటే ఎవరు కాదంటారు?? మరెందుకూ ఈ నానా బిల్డప్పులూ. తన బ్రాండ్ ఇమేజ్‌ని పెంచుకోవడానికి జగపతి తనకు లేని డిమాండ్ సృష్టించుకొనే ప్రయత్నం చేస్తున్నాడని అర్థమవుతూనే ఉంది. మరి ఈ ట్రిక్కులకు పడేదెవ్వరో చూడాలి.