ఇదిగో సినిమా అంటే అదిగో అయిటమ్ సాంగ్ అంటారు. పార్టీ సాంగ్ అన్నా, స్పెషల్ సాంగ్ అన్నా,పేరేదైనా అయిటమ్ సాంగ్ వుండాల్సిందే. రాబోయే కొరాటాల-మెగాస్టార్ మూవీ లో కూడా ఓ అయిటమ్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మెగా 150 మూవీలో రత్తాలు..రత్తాలు పాట ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. 151వ సినిమాలో అలాంటి అవకాశం లేకుండా పోయింది. అప్పటికీ తమన్నా దేశభక్తి గీతం వుంచారు. ప్రస్తుతం మెగా-కొరాటాల మూవీకి సన్నాహాలు జరుగుతున్నాయి. జనవరి నుంచి రెగ్యులర్ షూట్ వుంటుంది.
ఇదిలా వుంటే ఈ చిరు 152 సినిమాలో కూడా అయిటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం షార్ట్ లిస్ట్ చేసిన జాబితాలో రెజీనా పేరు మొదట వుందని తెలుస్తోంది. మెగాస్టార్ పక్కన రెజీనా డ్యాన్స్ అంటే కాస్త అనుమానంగా వుంటుంది. ఎందుకంటే మామూలు అయిటమ్ సాంగ్ వేరు, మెగాస్టార్ పక్కన వుండగా అయిటమ్ సాంగ్ అంటే వేరు.
ఆయన డ్యాన్స్ మూవ్ మెంట్స్ కు తగినట్లు వుండాలి. రెజీనా ఆ మేరకు సరిపోతుందా? అన్న అనుమానం. అయితే కొరటాల శివ ఆలోచనలు వేరుగా వుంటాయి. అన్నీ ఆలోచించకుండా, ఆయన అయితే రెజీనా పేరు ఫైనల్ లిస్ట్ లోకి తెచ్చి వుండరు.