రేణుదేశాయ్‌కి కోపం వచ్చింది.సముదాయించాలని ప్రయత్నించిన వ్యక్తితో ‘అమ్మతనం గురించి వారు (నెటిజన్) మాట్లా డుతూ ఉంటే నేను ఎలా మౌనంగా ఉంటా’అని కొంచెం స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారామె. ఇంతకూ ఆమె ఆ స్థాయిలో రియాక్ట్ కావడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటో తెలుసుకుందాం.
పవన్‌కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ అనే విషయం అందరికీ తెలిసిందే. తనకు పిల్లలంటే పంచ ప్రాణాలని ఆమె అనేక ఇంటర్వ్యూల్లో చెప్పారు. పవన్‌తో ఆమెకు ఇద్దరు పిల్లలు జన్మించారు. వారు అకీరా, ఆద్య. పవన్‌తో విడాకుల తర్వాత ఆమె పూణేలో జీవిస్తున్నారు.పిల్లల సరదా విషయాలను ఆమె ఎప్పటికప్పుడు తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
ఎప్పట్లాగే చెల్లెలు ఆద్యని అకీరా ఎత్తుకుని సరదాగా ఆడుకునే ఫొటోని రేణు సోషల్ మీడియాలో షేర్ చేశారు.అలాగే '1 2 3 అని లెక్కపెట్టేలోపు నేను మీ ముందు ఉంటా. ఆద్య, అకీరా క్రేజీ ఫెల్లోస్.. వారిద్దరూ నా సొంతం' అంటూ క్యాచీ క్యాప్షన్ పెట్టారామె.
ఈ ఫొటోతో పాటు క్యాచీ క్యాప్షన్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఫొటోపై ఓ నెటిజన్ ‘ఎంతైనా పవన్ రక్తం కదా’ అని కామెంట్ చేశాడు. ఎంతైనా పవన్ రక్తం…ఎందుకో ఆ మాటే ఆమెకు అసలు నచ్చలేదు. ఆమెకు రక్తం ఉడికిపోయింది. మనసులో చెలరేగిన భావాలను ఆమె ఏ మాత్రం దాచుకోలేరు.
‘సాంకేతికంగా, సైన్స్ పరంగా చెప్పాలంటే వారిద్దరిలో ప్రవహించేది నా రక్తం. మీకు సైన్స్ తెలిస్తే ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు’ అంటూ ఘాటైన సమాధానం ఇచ్చారామె. పవన్ అభిమానులు ఆమెను ఊరికే విడిచిపెట్టరు కదా!
యాక్షన్‌కు రియాక్షన్ అన్నట్టు మరో పవన్ అభిమాని స్పందిస్తూ ‘అభిమానులన్న తర్వాత ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. మీరు ఎందుకు పట్టించుకుంటారు’ అని ప్రశ్నించాడు. ఆ అభిమానిని కూడా ఆమె వదిలిపెట్టలేదు. ‘అమ్మతనం గురించి వారు మాట్లాడుతూ ఉంటే నేను ఎలా మౌనంగా ఉంటాను’ అని కొంచెం ఆవేదన, ఆక్రోశం, భావావేశంతో కూడిన సమాధానం చెప్పారు.
ఈ మొత్తం వ్యవహారంలో పిల్లలిద్దరిదీ పవన్రక్తం కాదనడం, అలాగే సైన్స్ తెలిస్తే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని రేణు ఘాటుగా స్పందించడం పవన్‌తో పాటు ఆయన అభిమానులను కాస్త హర్ట్ చేసేవే. రేణు మనసుకు ఎంతో కష్టం కలిగిస్తే తప్ప అంత ఘాటుగా రియాక్ట్ అయ్యారో మనకేం తెలుసు.