హీరో..ఈ టైటిల్, ఈ ప్రాజెక్టు చిరకాలంగా వార్తల్లో నలుగుతూనే వస్తోంది. విజయ్ దేవరకొండ-మైత్రీ మూవీస్ కాంబినేషన్. ఈ సినిమా పై దాదాపు పది కోట్ల వరకు ఖర్చు చేసాక, బ్రేక్ పడింది. డియర్ కామ్రేడ్ పేరుతో ఓ ఫ్లాప్ హీరోను పలకరించింది. ఆపైన అర్జెంట్ గా పూరి జగన్నాధ్ తో సినిమా అంటూ విజయ్ అటు వెళ్లారు.
అప్పుడే వార్తలు వచ్చాయి హీరో ప్రాజెక్టు క్యాన్సిల్ అని. కానీ నిర్మాతలు ఖండిచారు. ఆ ప్రాజెక్టు మీదకు వెళ్తామనే అన్నారు. ఈలోగా వరల్డ్ ఫేమస్ లవర్ అనే డిజాస్టర్ వచ్చింది విజయ్ కు. దాని ప్రభావమో, లేదా హీరో సినిమా ఇక వర్కవుట్ కాదని నమ్మకమో? మొత్తానికి ఆ ప్రాజెక్టుకు శాశ్వతంగా తెరపడింది.
ఇదీ ఇప్పుడు లేటెస్ట్ సంగతి. హీరో ప్రాజెక్టుకు బదులుగా మరో డైరక్టర్ తో మరో ప్రాజెక్టు చేయడానికి విజయ్ ఓకె అన్నాడు. అదే విధంగా ఈ పది కోట్ల వేస్ట్ ను కొంత వరకు విజయ్ భరించే అవకాశం వుందని తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ తో సినిమా చేసే డైరక్టర్ కోసం మైత్రీ మూవీ మేకర్స్ వెదుకుతున్నారు.
మారుతి, సుజిత్ ఇలా చాలా పేర్లు పరిశీలనలో వున్నాయి. ఎవరు సరైన సబ్జెక్ట్ తెస్తే వాళ్లతో విజయ్ చేయడానికి రెడీగా వున్నాడు. ప్రస్తుతం పూరి చేస్తున్న సినిమా కాగానే ఈ ప్రాజెక్టు స్టార్ అవుతుంది.