Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎక్స్ క్లూజివ్..తరుణ్ భాస్కర్ తో వెంకటేష్

ఎక్స్ క్లూజివ్..తరుణ్ భాస్కర్ తో వెంకటేష్

ఈ ఏడాది ఆరంభంలోనే ఎఫ్ 2 లాంటి హిట్ సినిమాను ఖాతాలో వేసుకున్నాడు విక్టరీ వెంకటేష్. ఆ వెంటనే మేనల్లుడు చైతూతో కలిసి వెంకీ మామ సినిమా స్టార్ట్ చేసారు. అది కూడా ఈ ఏడాదే విడుదల చేయడానికి చకచకా షూట్ చేస్తున్నారు. ఇప్పుడు మరో ప్రాజెక్టు కూడా అనౌన్స్ చేయబోతున్నారు.

పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో వైవిధ్యమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ తో సినిమా ఫిక్స్ అయింది. ఈ సినిమాను సురేష్ బాబే నిర్మిస్తారు. దగ్గుబాటి రామానాయుడు విగ్రహావిష్కరణ సందర్భంగా సురేష్ బాబు మీడియాలో రేపు మాట్లాడబోతున్నారు.

ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్-వెంకటేష్ సినిమాను ప్రకటించే అవకాశం వుంది. అలాగే రానా-గుణశేఖర్ కాంబినేషన్ లో నిర్మించే హిరణ్య కశిప సినిమా వివరాలు కూడా సురేష్ బాబు ప్రకటిస్తారని తెలుస్తోంది. సరైన స్క్రిప్ట్, అది కూడా వందశాతం సంతృప్తి కలిగిస్తే తప్ప, సురేష్ బాబు సినిమా నిర్మాణం చేపట్టరు.

అలాంటిది ఈ రెండు సినిమాలు నిర్మించబోతున్నారు అంటే కచ్చితంగా స్క్రప్ట్ లు ఆ రేంజ్ లో వుండే వుంటాయి అని అనుకోవాల్సిందే.

తండ్రీ కొడుకులు సాకులు వెతుకుతున్నారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?