cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

కల్కి విడుదల మరింత లేటు?

కల్కి విడుదల మరింత లేటు?

దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో రాజశేఖర్ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా కల్కి. ఈ సినిమా థియేటర్ రైట్స్ కూడా అమ్మేసారు. నిర్మాత కెకె రాధామోహన్, తమిళ హీరో ధనుష్ కు చెందిన సంస్థ ఈ హక్కులును కొనుక్కున్నాయి. కల్కి సినిమా మే నెలలోనే విడుదల అనుకున్నారు కానీ వర్క్ కాలేదు. మరి ఎప్పుడు డేట్ అన్నది తెలియదు. కానీ ఇప్పుడు సినిమాకు రిపేర్లు జరుగుతున్నట్లు గ్యాసిప్ లు గుప్పుమంటున్నాయి.

దర్శకుడు ప్రశాంత్ వర్మ, అంత సులువుగా క్వాలిటీ విషయంలో రాజీపడే రకం కాదు. గతంలో నానితో అ..సినిమా తీసినపుడు కూడా మొదట పేపర్ మీద అనుకున్న బడ్జెట్ వేరు, సినిమా పూర్తయిన తరువాత అయిన బడ్జెట్ వేరు. ఇప్పుడు కూడా కల్కి అవుట్ పుట్ మీద కాస్త అనువున్న వాటి విషయంలో రిపేర్లు చేపట్టినట్లు తెలుస్తోంది.

మరి ఈ రిపేర్ల కారణంగా సినిమా జూన్ లో విడుదల అవుతుందో? జూలైకి వెళ్తుందో చూడాలి. 

తండ్రీ కొడుకులు సాకులు వెతుకుతున్నారు