cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

ఆర్ ఆర్ ఆర్.. ఓవర్ సీస్ @70 కోట్లకుపైగానే

ఆర్ ఆర్ ఆర్.. ఓవర్ సీస్ @70 కోట్లకుపైగానే

రాజమౌళి సినిమా అంటేనే కోట్లకు కోట్లు. బహుబలి దగ్గర నుంచి ఆయన సినిమాల వ్యవహారం, వందల కోట్ల మీదనే నడుస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీది కూడా అదే తీరు. ఈ సినిమా 2020 సమ్మర్ టార్గెట్ గా తయారవుతోంది. ఇప్పుడిప్పుడే మార్కెటింగ్ డిస్కషన్లు స్టార్ట్ అవుతున్నాయి.

ముందుగా ఓవర్ సీస్ రైట్స్ విక్రయించడానికి నిర్మాత దానయ్య డిస్కషన్లు స్టార్ట్ చేసారని తెలుస్తోంది. సాహో సినిమా ఓవర్ సీస్ కొన్న దుబాయ్ సంస్థనే 66 కోట్ల వరకు ఆఫర్ తో వచ్చినట్లు తెలుస్తోంది. అయితే దానయ్యకు, ఆ సంస్థకు టాక్స్ అర్థాంతరంగా ముగిసినట్లు తెలుస్తోంది. దానయ్య ఆ రేటుకు ఇవ్వడానికి ఇష్టపడకపోవడమే కారణమని తెలుస్తోంది.

దానయ్య మదిలో ఈ సినిమా ఓవర్ సీస్ రైట్స్ ను 70 కోట్లకు పైగా రేట్ కు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ కావడం, బాహుబలి తరువాత సినిమా కావడంతో ఆ మాత్రం రేంజ్ వుంటుందని, ఆ రేటు పలుకుతుందని దానయ్య నమ్మకంతో వున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇటీవల ఓవర్ సీస్ మార్కెట్ తెలుగు సినిమాలకు అంత గొప్పగా లేదు. అందువల్లనే బయ్యర్లు పెద్ద సినిమాలు కొనడానికి జంకుతున్నారు. మరి ఏ రేటు దగ్గర ఆర్ ఆర్ ఆర్ క్లోజ్ అవుతుందో చూడాలి.

తండ్రీ కొడుకులు సాకులు వెతుకుతున్నారు