సీనియర్ హీరో వెంకటేష్ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నారు. తమిళ రీమేక్ నారప్ప ప్రస్తుతం ఫినిషింగ్ స్టేజ్ లోవుంది. దీని విడుదల డేట్ కూడా ప్రకటించేసారు. అనిల్ రావిపూడి డైరక్షన్ లో ఎఫ్ 3 సినిమా వుండనే వుంది.
ఇది కాక దృశ్యం 2 రీమేక్ కు కొబ్బరికాయ కొట్టనే కొట్టారు. అయితే ఎఫ్ 3 చాలా వరకు షూట్ జరిగింది. కానీ దృశ్యం 2 సినిమానే ముందు విడుదల చేస్తారనే గ్యాసిప్ వినిపిస్తోంది.
దృశ్యం 2 రీమేక్ జస్ట్ 25 కాల్ షీట్లలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అందువల్ల ఎఫ్ 3 షూటింగ్ షెడ్యూలు కు దొరికే గ్యాప్ లో ఈ సినిమాను ఫినిష్ చేసి, ముందే విడుదల చేసేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
అంటే ఈ ఏడాది వెంకీ సినిమాలు మూడు వరకు విడుదలయ్యే అవకాశం వుందన్నమాట. చూస్తుంటే సీనియర్ హీరోలు చిరు, నాగ్, వెంకీ, యంగ్ హీరోలతో సమానంగా చకచకా సినిమాలు సెట్ ల మీదకు తెస్తున్నట్లు కనిపిస్తోంది.