cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఫన్ ఆఫ్ సైరా..బాలయ్య

ఫన్ ఆఫ్ సైరా..బాలయ్య

అదిగో పులి అంటే ఇదిగో తోక అనే టైపు గ్యాసిప్ రాయుళ్లు పెరిగిపోయారు. అందుకే అందరూ కలిసి సైరా ఫంక్షన్ లో బాలయ్యను చూపించేసారు. బాలయ్యది పెద్ద మనసు అనిపించేసారు.

దాంతో అబ్బో నాగబాబు అలా అప్పట్లో క్రిటిసైజ్ చేసానా బాలయ్య పట్టించుకోలేదు. మెగా సినిమాను మెచ్చుకున్నాడు. సూపర్ అంటూ హడావుడి. ఫొటోలు. కబుర్లు కహానీలు.

కానీ విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం అక్కడ అంత సీన్ లేదు. అస్సలు ఏమీ లేదు. అసలు విషయం వేరు.

సైరాకు సుబ్బిరామి రెడ్డి అభినందన సభ పార్క్ హయాత్ హోటల్ లో జరిగింది. అంతవరకు వాస్తవం. కానీ దానికి బాలయ్య, వెంకటేష్ హాజరయ్యారన్నది అవాస్తవం.

అసలేం జరిగింది అంటే, సైరా అభినందన కార్యక్రమం పార్క్ హయాత్ లో జరుగుతున్న సమయంలోనే పై ఫ్లోర్ లో ఓ సినిమా డైరక్టర్ ఫ్యామిలీ ఫంక్షన్ జరిగింది. దానికి చిరు, బాలయ్య, వెంకటేష్ తదితరులు హాజరయ్యారు. ఆ ఫొటోలు బయటకు వచ్చాయి.

అంతే చిరు..బాలయ్య వున్నారు అంటే సైరా ఫంక్షన్ అయి వుంటుంది. పార్క్ హయాత్ వెన్యూ అంటే అది టీఎస్సార్ ఇచ్చిన ఫంక్షన్ నే అయి వుంటుంది. అనేసుకున్నారు. కథలు అల్లేసారు.

అంతే తప్ప సైరా-టీఎస్సార్ ఫంక్షన్ కు బాలయ్య వచ్చిందీ లేదు. మరేమీ లేదు.