మీడియా ముందుకు ‘కొరటాల’

కొరటాల శివ. తెలుగులో ఫ్లాపులు రుచి చూడకుండా, హిట్ లు మాత్రమే చూస్తున్న రెండవ దర్శకుడు. ఆయన చేయబోతున్నది మెగాస్టార్ 152వ సినిమా. ఈ సినిమాకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ను ఇటీవలే ఎక్స్…

కొరటాల శివ. తెలుగులో ఫ్లాపులు రుచి చూడకుండా, హిట్ లు మాత్రమే చూస్తున్న రెండవ దర్శకుడు. ఆయన చేయబోతున్నది మెగాస్టార్ 152వ సినిమా. ఈ సినిమాకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ను ఇటీవలే ఎక్స్ క్లూజివ్ గా వెల్లడించిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఆయన కుమారుడు రామ్ చరణ్ కీలకపాత్ర పోషిస్తున్నాడు అన్నదే ఆ బ్రేకింగ్ న్యూస్.

ఇప్పుడు ఈ విషయంలో మరింత అప్ డేట్ ఏమిటంటే, చిరు సినిమా విషయంలో కొరటాల ఓ కొత్త పంథా తొక్కబోతున్నారన్నది. దర్శకుడు రాజమౌళి మాదిరిగా ముందుగానే తాను చేయబోతున్న సినిమా విశేషాలు ఆయనే స్వయంగా చెప్పేసి, గ్యాసిప్ లకు ఆస్కారం లేకుండా చేయడం. జస్ట్ కొద్దిగా లైన్, జోనర్, వంటి విషయాలు వెల్లడించేందుకు మీడియా ముందుకు రావాలని కొరటాల అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

చరణ్ పాత్ర ఇదేనా?
అసలు ఇంతకీ చిరు 152వ సినిమాలో చరణ్ పాత్ర ఏమిటి? అంత కీలకమైన పాత్ర ఏమై వుంటుంది? అన్న డిస్కషన్లు వినిపిస్తున్నాయి. విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారం ప్రకారం కొరటాల సినిమాలో చరణ్ యంగ్ వెర్షన్ ఆఫ్ చిరంజీవిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

సినిమాలో చిరంజీవి పాత్ర ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చరణ్ కనిపిస్తారన్న మాట. అది కూడా మెగాస్టార్ కు బదులుగా. ఇది ఈ మధ్యన కొత్త ప్రయోగం. మామూలుగా అయితే చిరంజీవినే కాస్త యంగ్ గెటప్ లో కనిపించేయాలి. కానీ అలావేసి, మళ్లీ అమ్మడు.. కుమ్ముడు లాంటి సాంగ్ లు, హీరోయిన్ చూసి సిగ్గుపడడాలు చేస్తే, జనాలు యాక్సెప్ట్ చేస్తారా? అన్నది అనుమానం.

సైరాలో ఒకటి రెండు సీన్లకే జనాలు ట్రోలింగ్ మొదలు పెట్టారు. అందుకే అసలు చిరు బదులు మరో హీరో వేసేస్తే.. కానీ అలా ఎవరో వేసేకన్నా చరణ్ వేస్తే జనాల యాక్సెప్టెన్సీ ఎక్కువగా వుంటుంది. అందుకే చరణ్ పాత్ర ఇదీ అన్నమాట వినిపిస్తోంది.

ఎలాగూ కొరటాల మీడియా ముందుకు రాబోతున్నారు కాబట్టి అప్పుడు కచ్చితంగా తెలిసిపోతుంది.

అఖిలప్రియ.. కేరాఫ్ గందరగోళ రాజకీయం!