టెర్రరిస్ట్ గా ‘ఆ హీరోయిన్’

ఫ్యామిలీ మన్… అమెజాన్ ప్రయిమ్ తో పరిచయం వున్న ప్రతివారు ఇప్పుడు ముక్త కంఠంతో లైక్ చేసిన వెబ్ సిరీస్. బహుశ తెలుగులో సూపర్ హిట్ అయిన తొలి వెబ్ సిరీస్ ఇదేనేమో? పలు…

ఫ్యామిలీ మన్… అమెజాన్ ప్రయిమ్ తో పరిచయం వున్న ప్రతివారు ఇప్పుడు ముక్త కంఠంతో లైక్ చేసిన వెబ్ సిరీస్. బహుశ తెలుగులో సూపర్ హిట్ అయిన తొలి వెబ్ సిరీస్ ఇదేనేమో? పలు భాషల్లో డబ్ చేసి విడుదల చేసిన ఈ బాలీవుడ్ వెబ్ సిరీస్ లో తెలుగు జనాలకు పరిచయం వున్న మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి, సందీప్ కిషన్ లాంటి నటులు వున్నారు. పైగా ఈ వెబ్ సిరీస్ రూపకర్తలు డికె అండ్ రాజ్ కూడా తెలుగువారికి పరిచయం వున్నవారే. డి ఫర్ దొపిడీ అనే సినిమాను అందించారు గతంలో వాళ్లు. తరువాత బాలీవుడ్ లో సెటిల్ అయ్యారు.

పాక్ – ఇండియా వ్యవహారాలు, కాశ్మీర్, టెర్రరిజం నేపథ్యంలో తయారైన ఈ వెబ్ సిరీస్ బ్రహ్మండంగా క్లిక్ అయింది. తొలి సీజన్ లో 10 భాగాలు అందించారు. త్వరలో మరి సిరీస్ కూడా రాబోతోంది. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయింది. ఈ సెకెండ్ సీజన్ లో మన అక్కినేని వారి కోడలు, సమంత నటించడం విశేషం. ఈ విషయాన్ని గతంలోనే వెల్లడించాం.

అయితే ఇంకో అప్ డేట్ ఏమిటంటే, ఈ సెకెండ్ సీజన్ లో సమంత మామూలుగా నటించడం లేదు. నెగిటివ్ రోల్ చేస్తోంది. టెర్రరిస్ట్ గా కనిపించబోతోంది. వైవిధ్యమైన క్యారెక్టర్లను ఎంచుకుంటూ వస్తున్న సమంత, వెబ్ సీరీస్ లో కూడా అదే పంథా ఎంచుకోవడం విశేషం.

అసలే ఫ్యామిలీమన్ ఎలా వుందో రుచిచూసిన జనాలు, సమంత వుంది, అది కూడా నెగిటివ్ రోల్ అనగానే కచ్చితంగా ఎదురుచూపులు కాస్త ఎక్కువగానే వుంటాయి.

అఖిలప్రియ.. కేరాఫ్ గందరగోళ రాజకీయం!