లోకేష్ లేని లోటు తీరుస్తున్న చంద్రబాబు

ఈమధ్య లోకేష్ బాబు కామెడీని జనాలు కాస్త మర్చిపోయారు. కోచింగ్ తీసుకుంటూ బిజీగా ఉన్న చినబాబు.. మీడియా ముందుకు రావడానికి కసరత్తులు చేస్తున్నారు. ఈలోగా రాష్ట్ర ప్రజలు కామెడీ మిస్సవుతున్నారని భావించారేమో.. ఆ బాధ్యతను…

ఈమధ్య లోకేష్ బాబు కామెడీని జనాలు కాస్త మర్చిపోయారు. కోచింగ్ తీసుకుంటూ బిజీగా ఉన్న చినబాబు.. మీడియా ముందుకు రావడానికి కసరత్తులు చేస్తున్నారు. ఈలోగా రాష్ట్ర ప్రజలు కామెడీ మిస్సవుతున్నారని భావించారేమో.. ఆ బాధ్యతను ఇప్పుడు చంద్రబాబు తీసుకున్నారు. జిల్లా పర్యటనల్లో చంద్రబాబు మంచి కామెడీ చేస్తున్నారు. అప్పట్లో అసెంబ్లీలో వైఎస్సార్ చంద్రబాబుని చూసి భయపడేవారట. బాబు మాటలకు ఆయన జంకేవారట. విశాఖ మీటింగ్ లో ఈమాటలు విన్న పచ్చబ్యాచ్ చప్పట్లు కొట్టింది కానీ, లైవ్ లో బాబు ప్రేలాపనలు చూస్తున్న ప్రజానీకం మాత్రం నోరెళ్లబెట్టింది.

అసెంబ్లీలో ఎవరు ఎవర్ని చూసి భయపడేవారో ప్రజలందరికీ తెలుసు. కడిగేస్తాన్నిన్ను.. అంటూ ఆగ్రహంతో వైఎస్సార్ అసెంబ్లీలో హూంకరించిన వేళ చంద్రబాబుకి ముచ్చెమటలు పట్టడం ఇంకా ఎవరూ మర్చిపోలేదు. ఒకటా రెండా, ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. చంద్రబాబైనా, అప్పట్లో రాష్ట్ర విభజన అంశం లేవనెత్తే కేసీఆర్ అయినా వైఎస్సార్ వాగ్ధాటికి బిత్తరపోయేవారు. ఇప్పుడు మీసం మెలేస్తున్న ఈ పెదరాయుళ్లంతా.. అప్పట్లో వైఎస్ ముందు పిల్లికూనలే.

ఇంతకీ చంద్రబాబు ఆవేదన ఏంటంటే.. జగన్ ఆయన్ని చూసి భయపడటం లేదట. అప్పట్లో వైఎస్సే నా మాటలకు భయపడేవారు, ఇప్పుడు రౌడీరాజ్యం నడుస్తోంది అంటూ జగన్ పై పడి ఏడుస్తున్నారు చంద్రబాబు. బడ్జెట్ సమావేశాల్లో జగన్ ధాటికి తట్టుకోలేక అసెంబ్లీ నుంచి పారిపోయిన చంద్రబాబు ఇప్పుడిలా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో ఎక్కడికక్కడ చంద్రబాబు విధానాలను ఎండగట్టి సిగ్గుతో తలదించుకునేలా చేశారు జగన్. ఆ పరాభవం బాబు ఇంకా మర్చిపోయినట్టు లేదు, అందుకే ఇలా మాటలతో కాలం గడుపుతున్నారు.

అసలీ విజయం జగన్ ది కాదు, ప్రశాంత్ కిషోర్ ది అంటూ విశాఖ మీటింగ్ లో మరో జోకు పేల్చారు బాబు. జగన్ తరపున విద్యార్థుల్ని వెంటేసుకుని ప్రశాంత్ కిషోర్ ఊరూరా ప్రచారం చేశారట, దాని ఫలితమే టీడీపీ ఓటమి అట. ఇంకా ఇలాంటి అసత్య ప్రచారాలతో, చీప్ ట్రిక్స్ తో టీడీపీ కార్యకర్తల్ని చంద్రబాబు మోసం చేయాలని చూస్తున్నారు, తన “జబర్దస్త్” మాటలతో లోకేష్ ని మించిపోతున్నారు. 

పీవీపీ వర్సెస్ బండ్ల ఏది నిజం? ఏది అబద్దం?