Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఆర్టీసీ సమ్మె.. కేసీఆర్ మైండ్ గేమ్

ఆర్టీసీ సమ్మె.. కేసీఆర్ మైండ్ గేమ్

ఆర్టీసీ సమ్మె వారం రోజులకు చేరుకుంది. గడిచిన 2 రోజులుగా సమ్మెను తీవ్రతరం చేసిన కార్మికులు, దీన్ని సకల జనుల సమ్మెగా మార్చే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మిగతా ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభించారు. అయితే సరిగ్గా ఇక్కడే కేసీఆర్ తనదైన చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులతో మిగతా ఉద్యోగ సంఘాలు కలవకుండా తనదైన రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నారు.

ఓవైపు ఆర్టీసీ సమ్మె ఉధృతంగా జరుగుతుంటే, మరోవైపు టీఎన్జీవో ఉద్యోగులు ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమయ్యారు. డీఏ పెంపు, పీఆర్సీ అంశాలపై కేసీఆర్ తో చర్చలు జరిగాయంటూ ఫీలర్లు కూడా వదిలారు. అయితే అసలు విషయం ఏంటంటే.. ఆర్టీసీ ఉద్యోగులతో కలవొద్దని చెప్పడానికి, పరోక్షంగా వాళ్లకు హెచ్చరికలు జారీ చేయడానికే ఈ సమావేశం ఏర్పాటుచేశారని తెలుస్తోంది.

టీఎన్జీవో ఉద్యోగ సంఘాల నేతలు, శ్రీనివాస్ గౌడ్ తో కలిసి సీఎం కేసీఆర్ ను ప్రగతిభవన్ లో కలిశారు. ఈ సమావేశంలో ఆర్టీసీ సమ్మె అంశాన్ని తెరపైకి తెచ్చారు కేసీఆర్. ఆర్టీసీ సమ్మెను కేవలం ఆ సంస్థ సాగిస్తున్న పోరాటంగా మాత్రమే చూడాలని, సకల జనుల సమ్మెగా మార్చొద్దని టీఎన్జీవో నేతలకు సూచించారు కేసీఆర్. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి, ఉప ఎన్నిక ముగిసిన వెంటనే డీఏ పెంపు, పీఆర్సీ అంశంపై పాజిటివ్ గా నిర్ణయం తీసుకుంటాని వాళ్లకు భరోసా ఇచ్చారు.

కేసీఆర్ మైండ్ గేమ్ తో ఇక ఆర్టీసీ సమ్మె సకల జనుల సమ్మెగా మారడం అసాధ్యం అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే.. ఈ సమ్మె సకల జనుల సమ్మెగా మారాలంటే టీఎన్జీవోల మద్దతు తప్పనిసరి. ఎన్ని సంఘాలు చేరినా, వీళ్లు కలిసిరాకపోతే సకల జనుల సమ్మె సాకారం అవ్వదు. అందుకే ముందుగా వీళ్లను బుజ్జగించారు కేసీఆర్. ఇక టీఎన్జీవో నేతలతో ఆర్టీసీ కార్మికులు ఎన్ని సంప్రదింపులు చేసినా ప్రయోజనం ఉండదని భావిస్తున్నారు చాలామంది.

మరోవైపు సమ్మెతో ప్రయాణికుల కష్టాలు రెట్టింపు అయ్యాయి. దసరా శెలవులు ముగించుకొని హైదరాబాద్ తో పాటు ఇతర పట్టణాలకు చేరుకుంటున్న ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు భారీగా చేసినట్టు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, సమయానికి బస్సులు అందుబాటులో ఉండడంలేదు. మరీ ముఖ్యంగా ఉదయం, రాత్రివేళల్లో బస్సులు కనిపించడం లేదు. దీంతో క్యాబ్స్, ఆటోలు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నాయి. ట్రయిన్లపై హైదరాబాద్ కు చేరుకుంటున్న ప్రయాణికులు, రైల్వేస్టేషన్ నుంచి ఇళ్లకు వెళ్లడానికి వందల్లో డబ్బు చెల్లించాల్సి వస్తోంది. 

పీవీపీ వర్సెస్ బండ్ల ఏది నిజం? ఏది అబద్దం?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?