గబ్బర్ సింగ్ 2 రికార్డింగ్ షురూ

గబ్బర్ సింగ్ 2 కు కాస్త కదలిక వచ్చింది. ఈ సినిమా పాటలకు దేవీ శ్రీ ప్రసాద్ ట్యూన్లు కడుతున్నారు. చెన్నయ్ లో మ్యూజిక్ సిట్టింగ్ లు జరుగుతుండడంతో దర్శకుడు బాబి అక్కడే వున్నారు.…

గబ్బర్ సింగ్ 2 కు కాస్త కదలిక వచ్చింది. ఈ సినిమా పాటలకు దేవీ శ్రీ ప్రసాద్ ట్యూన్లు కడుతున్నారు. చెన్నయ్ లో మ్యూజిక్ సిట్టింగ్ లు జరుగుతుండడంతో దర్శకుడు బాబి అక్కడే వున్నారు. పవర్ స్టార్ మాత్రం ఒకసారి వెళ్లి వచ్చేసినట్లు తెలుస్తోంది. వర్క్ ఓ కొలిక్కివచ్చాక ఆయన మళ్లీ వెళ్తారని వినికిడి. 

ఈ నెలాఖరు నుంచి ఎలాగైనా సెట్ మీదకు వెళ్లిపోవాలని పవన్ భావిస్తున్నారు. అలా షూటింగ్ కు వెళ్లకుండా పవన్ ఖాళీగా వుంటే, అలా ఖాళీగా వుండి కూడా రైతుల సమస్యలు, వివిధ ప్రజా వ్యతిరేక విధానాలు పట్టించుకోవడం లేదన్న విమర్శలుఎదుర్కోవలసి వుంటుంది. 

అదే కనుక షూటింగ్ లో బిజీ అయిపోతే ఇక బాబు బాగా బిజీ అనుకుని సర్దుకుపోవడమే.