బాలకృష్ణ హీరోగా ‘డిక్టేటర్’ పేరుతో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకి శ్రీవాస్ దర్శకుడు. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాలతో దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు సంపాదించుకున్న శ్రీవాస్, బాలకృష్ణతో ఔట్ అండ్ ఔట్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.
మే 29వ తేదీన ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం కానుంది. జూన్ 10 నుంచి రెగ్యులర్‌గా సినిమా షూటింగ్ జరగనుంది. బాలకృష్ణ సరసన నయనతార ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించనుందని శ్రీవాస్ చెబుతున్నాడు. ‘డిక్టేటర్’ సినిమాలో బాలయ్యను డిఫరెంట్‌గా చూపించనున్నాడట శ్రీవాస్. ఇప్పటిదాకా బాలయ్యను ఎవరూ చూపించనంత పవర్‌ఫుల్‌గా ‘డిక్టేటర్’లో శ్రీవాస్ చూపిస్తాడట.
తమన్ సంగీతం అందిస్తున్న ‘డిక్టేటర్’ చిత్రాన్ని దసరా పండుగకి విడుదల చేయనున్నారు. నయనతార, బాలకృష్ణ కాంబినేషన్‌లో ‘సింహ’, ‘శ్రీరామరాజ్యం’ చిత్రాలు ఘనవిజయం సాధించిన విషయం విదితమే. ముచ్చటగా మూడోసారి బాలయ్య, నయనతార నటించనున్న ‘డిక్టేటర్’ ఆ సెంటిమెంట్‌ని మరోమారు నిజం చేయనుందేమో వేచి చూడాలి.