Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

గేమ్ ఛేంజర్.. అదేనా సమస్య?

గేమ్ ఛేంజర్.. అదేనా సమస్య?

శంకర్-రామ్ చరణ్ కాంబినేషన్‌లో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమా ఏనాటి నుంచో షూటింగ్ లోనే వుంది. ఇప్పట్లో వస్తుందన్న సూచనలు కూడా కనిపించడం లేదు. ఇండియన్ 2 సినిమా ను దర్శకుడు శంకర్ ముందుగా విడుదల చేయాల్సి వుంది. అది ఒక రీజన్. ఆ సినిమా 2024 సమ్మర్ కు విడుదల అంటున్నారు. 

అంటే గేమ్ ఛేంజర్ ఆ తరువాత రావాల్సి వుంటుంది. అంటే ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ సినిమా రావడానికి కనీసం ఇంకో ఏడెనిమిది నెలలు పడుతుందేమో? బహుశా 2024 దసరాకు వెలుగు చూస్తుందేమో?

ఆ సంగతి అలా వుంచితే ఈ సినిమా నుంచి ఓ పాట లీక్ అయింది. జరగండి.. జరగండి అనే పాట లీక్ అయిన తరువాత కొన్నాళ్ల నుంచి ఆ పాట అడియో విడుదల చేస్తారు అనే వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. దసరా అయిపోయింది. దీపావళి అయిపోతోంది. మరింక ఎప్పుడు విడుదల అన్నది క్లారిటీ లేదు. ఫ్యాన్స్ ఈ విషయంలో చాలా ఆతృతగా వున్నారు.

ఈ నేపథ్యంలో ఓ గ్యాసిప్ వినిపిస్తోంది. థమన్ చేసిన ఓ పని వల్లనే ఈ పాట విడుదల ఆలస్యం అవుతోందన్నది ఆ గ్యాసిప్. విషయం ఏమిటంటే జరగండి.. జరగండి.. పాట లీక్ అయింది. అప్పుడు థమన్ కు ఓ కొత్త ఆలోచన వచ్చిందట. 

అప్పటికే ఆ పాట లీక్ అయింది కనుక దాన్ని జస్ట్ ట్రాక్ అని చెప్పుకోవచ్చు. బాగా బెటర్ చేసే ఆలోచనతో అప్పటికి పాడించిన దాన్ని పక్కన పెట్టి దలేర్ మెహంది చేత పాడించినట్లు తెలుస్తోంది. మొత్తం అయిన తరువాత దాన్ని దర్శకుడికి పంపినట్లు తెలుస్తోంది.

తనకు చెప్పకుండా చేసారనో, లేదా తను అనుకున్నట్లు వాయిస్ లేదనో మొత్తానికి దర్శకుడు శంకర్ ఆ పాట విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోవడం లేదని తెలుస్తోంది. అందువల్ల పాట ఎప్పుడు వస్తుందన్నది క్లారిటీ లేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?