సమంత.. ఏదో చెప్పడానికి ట్రై చేస్తోంది కదా!

రీసెంట్ గా సమంత నుంచి వచ్చిన స్టిల్స్ ఇవి. గడిచిన వారం రోజులుగా ఇలా వరుసపెట్టి హాట్ ఫొటోలు రిలీజ్ చేస్తోంది సమంత. ఈ ఫొటోలతో ఆమె సినీ సమాజానికి అంతర్లీనంగా ఓ సందేశం…

రీసెంట్ గా సమంత నుంచి వచ్చిన స్టిల్స్ ఇవి. గడిచిన వారం రోజులుగా ఇలా వరుసపెట్టి హాట్ ఫొటోలు రిలీజ్ చేస్తోంది సమంత. ఈ ఫొటోలతో ఆమె సినీ సమాజానికి అంతర్లీనంగా ఓ సందేశం ఇస్తోందనేది నెటిజన్ల మాట. అదే హాట్ ఇమేజ్ అప్పీల్.

స్టార్ హీరోల సినిమాల నుంచి, కమర్షియల్ హీరోయిన్ ఫార్మాట్ నుంచి తప్పుకుంది సమంత. ఆమె తనకంటూ ఓ సెపరేట్ రూటు నిర్మించుకునే పనిలో పడింది. ఈ క్రమంలో ఆమె కొంతమేర సక్సెస్ అయినప్పటికీ శాకుంతలం లాంటి ఎదురుదెబ్బలు కూడా ఉన్నాయి.

అయితే సమంత ఫ్యాన్స్ లో ఓ వర్గం మాత్రం, ఆమెను ఇంకా గ్లామర్ హీరోయిన్ గానే చూస్తోంది. దూకుడు, బృందావనం, జనతా గ్యారేజీ లాంటి సినిమాల్లో కనిపించినంత గ్లామర్ గా మరోసారి కనిపించాలని, స్టార్ హీరోల సినిమాల్లో నటించాలనే ఆన్ లైన్ అభ్యర్థనలు ఎప్పటికప్పుడు ఆమెకు అందుతూనే ఉన్నాయి.

సమంత కూడా మరోసారి ఆ దిశగా ఆలోచిస్తున్నట్టుంది. అందుకే ఇలా హాట్ హాట్ ఫొటోలను వరుసగా విడుదల చేస్తోంది. ప్రస్తుతం సినిమాలకు చిన్న విరామం ఇచ్చిన ఈ బ్యూటీ, తిరిగి సినిమాల్లోకి వచ్చిన తర్వాత గ్లామర్ పాత్రల్లో కూడా నటించే అవకాశం ఉందంటున్నారు చాలామంది. దానికి ఈ ఫొటోషూట్సే నిదర్శనమని చెబుతున్నారు.

ప్రభాస్-సమంత, పవన్-సమంత, మహేష్-సమంత.. ఇలాంటి కాంబినేషన్లు చూడాలని చాలామంది ప్రేక్షకులు కోరుకుంటున్నారు. సమంతకు కూడా మరోసారి గ్లామర్ పాత్రల వైపు మనసు మళ్లినట్టుంది. తనలో గ్లామర్ డోస్ ఇంకా తగ్గలేదని, ఆమె ఇండస్ట్రీకి చెప్పాలనుకుంటోందేమో. అందుకే ఈ ఫొటోలతో పరోక్షంగా పరిశ్రమకు తన మనసులో మాటను వ్యక్తం చేస్తున్నట్టుంది. 

Click Here More Photos