మహేష్ బాబు-వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మించే సినిమాలో హీరో గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తాడన్న సంగతి ఇప్పటికే వెల్లడించాం. ఇప్పుడు మరి కొన్ని అప్ డేట్స్. సినిమాలో గ్యాంగ్ స్టర్ ఎపిసోడ్ లు మొత్తం మీద 40 నిమషాలే వుంటాయని తెలుస్తోంది. రెండు షేడ్స్ లో మహేష్ కనిపిస్తాడు. రెండో షేడ్ లో లెక్చరర్ నో ప్రొఫసర్ మాదిరగానో కనిపిస్తాడని తెలుస్తోంది.
రజనీ భాషా ఎంత హిట్ అన్నది తెలిసిందే. ఆ టైపులో హాలీవుడ్ స్టయిల్ లో తీస్తే ఎలా వుంటుందో అదే మహేష్ సినిమా అన్నది వంశీ పైడిపల్లి ఆలోచనగా తెలుస్తోంది. మామూలుగానే మహేష్ సినిమాలకు వంద కోట్ల బడ్జెట్ అవుతుంది. ఈ సినిమాకు అంతకు మించి అవుతుందని తెలుస్తోంది.
పోకిరి తరువాత ఆ తరహా ఫైట్లు, విన్యాసాలకు అవకాశం వున్న సినిమాగా ఇది వుంటుంది. గ్యాంగ్ స్టర్ ఎపిసోడ్ లు టాప్ లెవెల్ లో వుంటాయని, వాటికే ఖర్చు ఎక్కువ అని తెలుస్తోంది.