దర్శకుడు పూరి జగన్నాధ్ అంటే ఇలా అనౌన్స్ చేసి, అలా సినిమా తీసి థియేటర్ లో పెట్టేసే టైపు. ఆయన టేకింగ్, షూటింగ్, ప్లానింగ్ అంతా సూపర్ స్పీడ్. నలభై నుంచి అరవై రోజుల్లో సినిమా ఫినిష్ చేసేయడమే. ఎంత పెద్ద సినిమా అయినా ఇదే టైపు. కానీ తొలిసారి ఆయన వంద రోజులకు పైగా షూటింగ్ జరిపే సినిమా చేస్తున్నారట.
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ డైరక్షన్ లో చార్మి నిర్మించే సినిమా కు స్పాన్ చాలా ఎక్కువ అని తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ముంబాయి లో విదేశీ ఫైట్ మాస్టర్ల డైరక్షన్ లో యాక్షన్ సీక్వెన్స్ ల షూట్ జరుగుతోంది. దీనికి కోసం ఓ భారీ సెట్ వేసారు.
అయితే సినిమా కథ, స్పాన్ ఎక్కువ కావడంతో వంద రోజుల పైనే షూట్ వుంటుందని తెలుస్తోంది. అందువల్లే ఈ సినిమా సమ్మర్ కు రెడీ కాదు. దసరా లేదా ఆ ప్రాంతంలో విడుదల వుండే అవకాశం వుంది. ప్రస్తుతం ముంబాయి షెడ్యూలు అయిన తరువాత కాస్త గ్యాప్ ఇచ్చి, హీరో సినిమా ఓ షెడ్యూలు చేసి, మళ్లీ ఫైటర్ సినిమా కు వస్తాడు హీరో విజయ్.