ఈ వారం మిగిలిన సినిమాలతో పాటు విడుదల కావాల్సింది గంగ (కాంచన 2). కానీ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఆర్థిక సమ్యసలు, వాటిపై కేసుల కారణంగా ఆగిందని వినికిడి. కానీ తమిళనాటు ఈ రోజు విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. బి, సి ల్లో దుమ్ము దులుపుతుందన్న టాక్ వచ్చింది. సినిమా పక్కా బి. సి సెంటర్ల సినిమా అని మరో టాక్.
Advertisement
మొత్తానికి ఇప్పుడు ఈ టాక్ నిర్మాత బెల్లంకొండ సురేష్ కు కాస్త ఊపిరిపోసింది. సినిమాకు వున్న అడ్డంకులపై డిస్కషన్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. రేపు ఫైనల్ చేసి, ఆదివారం విడుదల చేయడమా? లేక 24నే విడుదల చేయడమా అన్నది నిర్ణయిస్తారట. అదీ సంగతి.