‘గ్యారేజ్’ కు గ్రహణం సెంటిమెంట్

జనతా గ్యారేజ్ విడుదల తేదీని ఓ రోజు ముందుకు జరిపారు. సెప్టెంబర్ 2 నుంచి 1కి తీసుకువచ్చారు. వామపక్షాల బంద్ కారణంగా ఇలా చేయక తప్పలేదు. దీనివల్ల గురు వారం నుంచి సోమవారం వరకు…

జనతా గ్యారేజ్ విడుదల తేదీని ఓ రోజు ముందుకు జరిపారు. సెప్టెంబర్ 2 నుంచి 1కి తీసుకువచ్చారు. వామపక్షాల బంద్ కారణంగా ఇలా చేయక తప్పలేదు. దీనివల్ల గురు వారం నుంచి సోమవారం వరకు అయిదు రోజులు మంచి కలెక్షన్లు వుంటాయని భావిస్తున్నారు. అయితే సినిమా రంగం అంటే సెంటిమెంట్లు కుప్పలు తెప్పలుగా వుంటాయి. నిర్మాతలు, దర్ళకులు, హీరోలు ఇలా ఎవరి నమ్మకాలు వారికి వుంటాయి. ఎవరి సెంటి మెంట్లు వారికి వుంటాయి.

దర్శకుడు త్రివిక్రమ్ తన గురువైన సిద్ధాంతి గారితోనే ముహుర్తాలు పెట్టించుకుంటారు. దర్శకుడు మారుతి ఇటీవల బాబు బంగారం సినిమాను విడుదలకు రెండు రోజులు ముందుగానే ముహుర్తం కోసం లాంచనంగా కొద్దిమందితో విడుదల చేసుకున్నారు. ఇలా శుక్రవారం సరైన ముహుర్తం లేకపోతే, ముందగానే ఓ పదిమందితో సినిమా వేసుకుని, టికెట్ లు కొనుక్కుని అడ్జెస్ట్ చేసుకోవడం ఆనవాయితీగా వుంది.

ఇంతకీ గ్యారేజ్ సంగతేమిటంటే, 1వ తేదీ అమావాస్య, పైగా ఆ రోజు సూర్య గ్రహణం అంట. తమిళులకు అమావాస్య అంటే మహా మంచి రోజు కానీ, మన జనాలకు అమావాస్య అంటే మరే పనికి పనికిరాని రోజు. పైగా ఆ రోజు సూర్య గ్రహణం పడిందట. దీంతో ఎన్టీఆర్ అభిమానులు కలవరపడుతున్నట్లు తెలుస్తోంది. మరి దీనికి నివారణగా ఒకటి రెండు రోజులు ముందుగా ఏదైనా షొ సెట్ చేసుకుంటారేమో? చూడాలి.