ఉదయభాను..తెలుగు ఏంకర్లలో ఒకప్పుడు నెంబర్ వన్. కేవలం మాట చాతుర్యం, అభినయమే కాకుండా, అందం కూడా ఆమె సొంతం. కొన్ని తెలుగు సినిమాల్లో ఆ అందం తళుక్కున మెరిసింది కూడా. రాజశేఖరా..నీపై మోజు తీరలేదురా అంటూ లీడర్ సినిమాలో ఆమె ఒలకబోసిన హోయలు ఇప్పటికీ కళ్ల ముందే వున్నాయి చాలా మందికి. రాను రాను ఏంకరింగ్ కు కాస్త దూరమవుతూ వస్తోంది ఉదయభాను.
ఏకరింగ్ లో ఓ ఏలుబడి సాగించినా వ్యక్తిగత జీవితం మాత్రం చాలా ఒడిదుడుకులతోనే గడిచింది. చిన్నప్పుడే పెళ్లి, ఆపై తల్లితో విబేధాలు, మళ్లీ కలవడం, ఇలా సంఘనటలు ఉదయభాను జీవితంలో సంచలనాలే. అయితే ఇటీవల ఉదయభాను పేరు ఎక్కడా వినిపించలేదు.
ఇప్పుడు ఉన్నట్లుండి మళ్లీ ఉదయభానుపై ఓ గ్యాసిప్ వినిపిస్తోంది. ఆమె ఇప్పుడు తల్లి కాబోతోందన్నది ఆ గ్యాసిప్. పిల్లలు అంటే ఎంతో ఇష్టపడే ఆమె తన కెరీర్ కారణంగా ఇన్నాళ్లు మాతృత్వానికి దూరంగా వుందట. ఇప్పుడు ఆ కోరిక తీరబోతోందని గ్యాసిప్ లు గుప్పుమన్నాయి. అవే నిజమైతే, కంగ్రాట్స్ ఉదయభాను.