గరుడవేగ సినిమా విడుదలై నాలుగు రోజులు దాటిపోయింది. ఇంక కలెక్షన్లను నిలబెట్టుకోవాలి. అందుకే టోటల్ టీమ్ ఛలో ఆంధ్ర అంటోంది. ఈ నెల 9న బయల్దేరి సూర్యాపేట నుంచి గుంటూరు మీదుగా, విజయవాడ చేరి, అక్కడి నుంచి శ్రీకాకుళం వరకు, దాదాపు ప్రతి పట్టణాన్ని, గరుడవేగ ఆడుతున్న ప్రతి థియేటర్ ను సందర్శిస్తారట.
అంటే కాస్త పెద్ద పనే పెట్టుకున్నారు. కనీసం మూడు నుంచి నాలుగు రోజులు పడుతుంది. రోజుకు అరడజను ఊళ్లు కవర్ చేసేసినా. అట్నుంచి వచ్చాక నైజాం టూర్ సంగతి చూస్తారు.
గరుడవేగ సినిమాను ఆంధ్ర, సీడెడ్ లో ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అందువల్ల ఎంత ప్రమోట్, చేస్తే అంత మంచిది. వచ్చే షేర్ పూర్తిగా నిర్మాతలయిన జీవితం అండ కో కే. అందుకే గట్టి ప్రచారం చేయాలని డిసైడై, ఈ బస్సు యాత్ర స్టార్ట్ చేస్తున్నారు.
బస్ యాత్రలో రాజశేఖర్ తో పాటు డైరక్టర్ ప్రవీణ్ సత్తారు, శ్రద్ధా దాస్, మిగిలిన నటులు కూడా పాల్గొంటారట.