మీ దగ్గర మాంచి బ్యాంక్ కార్డు వుందా? దాంట్లో కాస్త దండింగా డబ్బులు వున్నాయా? అయితే ఛలో.. ఆ ' యాక్ట్రెస్ ' తో ఓ వారం దేశాలు తిరిగేసి రావచ్చు. తెలుగు ఇండస్ట్రీలో అంతగా పేరు తెచ్చుకోని ఓ హీరోయిన్ పై వినిపిస్తున్న గ్యాసిప్ ఇది. ఆ అమ్మాయికి ఎవరూ లేరు. లైఫ్ మీద అంత సీరియస్ నెస్ కూడా లేదు అని టాక్. ఎవడినో చేసుకుంటే, వాడు తిన్నగా వుంటాడని గ్యారంటీ లేదు. బాధపెట్టడు, బ్రేక్ అప్ చెప్పడు అని నమ్మకం లేదు.
ఎందుకొచ్చిన జంఝాటం. హాయిగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తే పోలా?అని డిసైడ్ అయిపోయినట్లు బోగట్టా. అందుకే ఎర్లీ డేస్ నుంచే ఇలాంటి లైఫ్ ను ఛూజ్ చేసుకుని సాగిపోతోంది. హ్యాపీగా పబ్ లకు వెళ్లడం. లేదా ఎవరన్నా సౌండ్ పార్టీ టచ్ అయితే, చూడని దేశానికి జోడీగా వెళ్లిపోయి, కార్డులో డబ్బులున్నాళ్లు ఎంజాయ్ చేసి రావడం. ఆ తరువాత మళ్లీ మామూలే.
దేశాలు చూడడం, అక్కడ ఫొటోలు తీసుకుని, సోషల్ మీడియాలో పెట్టడం చాలా ఇష్టం. అందుకే ఎవరన్నా 'టచ్' అయితే, చూడని దేశాన్ని ఎంచుకుని ఛలో అంటుందట ఆమె. బాగానే వుంది. దీపం వుండగా ఇల్లు చక్కబెట్టుకోవడం అన్న కాన్సెప్ట్ మారినట్లుంది..దీపం వుండగానే వెలుగు అనుభవించేద్దాం అనే కాన్సెప్ట్ వచ్చినట్లుంది.