అమ్మాయిలు ఎంతో అందంగా పెంచుకునే గోళ్ళ వల్ల అబ్బాయిలకు అప్పుడప్పుడూ గాయాలు అవుతుంటాయి. అలాంటి గాయమే ఇలియానా ప్రియుడు ఆండ్రూకి అయ్యిందట. దాంతో ఇలియానా తన పొడవాటి గోళ్ళ సైజ్‌ని తగ్గించుకుందని పుకార్లు విన్పిస్తున్నాయి.
ఎంత లేదన్నా ఇలియానా, ఫొటోగ్రాఫర్ ఆండ్రూ మధ్యన ఏదో వుందని ఎప్పుడో తేలిపోయింది. ఇలియానా ఎప్పుడూ మందకొడిగా, నీరసంగా వుండేది కాస్తా ఇప్పుడు బాగా ముసారుగా తయారయ్యి గోవా బీచ్‌లో లేడి పిల్లలా పరుగులు పెడుతుందట. ఇటీవల కాంబోడియాలో షూటింగ్ చేసుకుని వచ్చిన ఇలియానాతోపాటే ఆండ్రూ కూడా ముంబైలో విమానం దిగాడట. అయితే అతని నొసల మీద బ్యాండ్ ఎయిడ్ స్టిక్కర్ అతికించి వుందట.
ఇటు చూస్తే ఇలియానా పొడవాటి గోళ్ళు కట్ అయి వున్నాయట. అంటే ఆండ్రూ బాబు నొసటి మీద గాయానికీ ఇలియానా గోళ్ళకూ ఏదో సంబంధం వుండకుండా వుంటుందా? దీన్ని బట్టి సరసంలో కూడా కొన్ని గాయాలవుతాయనీ, అలాగే అలాంటి దెబ్బలు ఎంతో ఆత్మీయతను పంచుతాయని కూడా మానసిక నిపుణులు చెబుతారు కాబట్టి, ఇలియానా చేసిన గాయం.. ఇప్పట్లో తగ్గేలా కనిపించడంలేదు. ధనుర్వాతం రాకుండా ఆండ్రూ ఇంజెక్షన్ చేయించుకుంటే మంచిదేగా.